GHMC: 29న స్టాండింగ్ కమిటీ మీటింగ్.. కమిటీ ముందుకు రానున్న
GHMC ( image credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: 29న స్టాండింగ్ కమిటీ మీటింగ్.. కమిటీ ముందుకు రానున్న 15 అంశాల అజెండా!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాభివృద్ది, పౌర, అత్యవసర సేవలతో పాటు పరిపాలన వ్యవహారాల్లో జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే జీహెచ్ఎంసీ ఈ నెల 29న మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలతో కూడిన అజెండా కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది. వీటిలో ఇజ్జత్ నగర్, భిక్షపతి నగర్ లలో రూ. 2.60 కోట్ల వ్యయంతో స్మశానవాటికలో బర్నింగ్ యూనిట్, పూజా మండపం, దింపుడు గల్లెం, గ్యాలరీలో సీట్లు,టాయిలెట్ బాక్స్, ఉడ్ స్టోరేజీ రూమ్ నిర్మాణ ప్రతి పాదన స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది. దీంతో పాటు ఈఎన్ టీ హాస్పిట్ వద్ద రూ. 2.65 కోట్లతో బాక్స్ డ్రెన్ నిర్మించాలన్న ప్రతిపాదన కూడా కమిటీ పరిశీలించనుంది.

చందానగర్ నుంచి అమీన్ పురా వరకు రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ సవరణ ప్రతిపాదనతో పాటు మియాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్డ వరకు 45 అడుగుల వెడల్పుతోనున్న రోడ్డును 60 అడుగుల మేరకు విస్తరించే ప్రతిపాదన కూడా కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది. ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఈ-ప్రొక్యూర్ మెంట్ టెండర్లకు మేనేజ్డి్ సర్వీస్ ప్రొవైడర్, తార్నాక జంక్షన్ లో సర్వేజన ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏర్పాటు చేయనున్న హెల్మెట్ నమూనా శిల్పం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రతిపాదన కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.

Also Read: GHMC: అక్రమ అనుమతులు..అడ్డదారిలో ఓసీలు.. 27 సర్కిళ్లలో వెలుగులోకి సంచలనాలు..!

స్టడీ టూర్ ప్రతిపాదన సైతం

ఫిబ్రవరి 10తో అధికార గడువు ముగియనున్న సమయంలో కూడా స్టడీ టూర్ లకు కార్పొరేటర్లు ప్లాన్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు రెండు సార్లు స్టడీ టూర్ లకు వెళ్లిన కార్పొరేటర్లు తాజాగా అహ్మదాబాద్, చండీఘడ్ నగరాల్లో సడీ టూర్ కు ప్లాన్ చేసినట్లు, 29న జరగనున్న స్టాండింగ్ కమిటీలో ఈ ప్రతిపాదనను కమిటీ ముందు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలతో కూడిన అజెండా కమిటీ ముందుకు రానుంది. వీటిలో 14(ఏ) ఐటమ్ గా స్టడీ టూర్ ను కమిటీ ముందు పెట్టేందుకు రంగం సిద్దమైంది. 145 మంది కార్పొరేటర్లు స్టడీ టూర్ కు దాదాపు రూ. కోటిన్నర వరకు వెచ్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు గచ్చిబౌలీ ఐకియా ముందున్న గ్రీనరీ మెయింటనెన్స్ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు ఎవోక్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలకు కొనసాగించేలా అనుమతి కోరుతూ ప్రతిపాదన కమిటీ ముందుకు రానుంది.

689 చదరపు గజాల స్థలం లీజు

దీంతో పాటు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసునుంచి చందానగర్ రైల్వే స్టేషన్ వరకున్న సెంట్రల్ మీడియా మెంటనెన్స్ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు కమలసాన ప్రొపర్టీస్, సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ కు పొడిగించాలన్న ప్రతిపాదన కూడా కమిటీ ముందుకు రానుంది. శేరిలింగంపల్లి జోన్ లోని భాగ్యలక్ష్మి నగర్ కాలనీ పార్కును మెయింటనెన్స్ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు పొడిగించాలని, బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ సెంట్రల్ మీడియా, ట్రాఫిక్ ఐలాండ్ మెయింనెన్స్ బాధ్యతలను రానున్న మూడేళ్ల పాటు పొడిగించాలన్న ప్రతిపాదన, సీఎస్ఆర్ ప్రాతిపదికన శ్రీశ్రీ హాలిస్టిక్స్ హాస్పిటల్ పది కిలోమీటర్ల పొడువున ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు , మసీదు బండలో సెంట్రల్ మీడియా మెయింటనెన్స్ బాధ్యతలను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న ప్రతిపాదనతో పాటు జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగానికి చెందిన దోమల్ గూడలోని ఎస్ బీహెచ్ కాలనీ లోని 689 చదరపు గజాల స్థలం లీజు ఈ సంవత్సరం మార్చి మాసంలో ముగియటంతో మళ్లీ లీజు ఎక్స్ టెన్షన్ కోసం ప్రతిపాదన 29న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.

Also Read: GHMC: బల్దియాలో ఇంజినీర్ల కొరత.. పని భారంతో అల్లాడుతున్న అధికారులు

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

Sandhya Theatre Case: ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్ పేరు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

Operation Aaghat 3.0: దిల్లీలో స్పెషల్ ఆపరేషన్.. 24 గంటల్లో 660 మందికి పైగా అరెస్టు.. ఎందుకంటే?

Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్

Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి