GHMC: అక్రమ అనుమతులు.. వెలుగులోకి సంచలనాలు..!
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: అక్రమ అనుమతులు..అడ్డదారిలో ఓసీలు.. 27 సర్కిళ్లలో వెలుగులోకి సంచలనాలు..!

GHMC: జీహెచ్ఎంసీలో ఇటీవలే విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో అక్రమ నిర్మాణ అనుమతులు, అడ్డాదిరిలో అక్యుపెన్సీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నట్లు సమాచారం. గత నెల 25వ తేదీన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే, కౌన్సిల్ సమావేశం దాన్ని ఆమోదించి, విలీన సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిమార్క్స్ రిపోర్టు చేయాలని ఆదేశించటంతో కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విలీన ప్రక్రియను వేగవంతం చేసి, పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు విలీనానికి ప్రతిపాదించిన పట్టణ స్థానిక సంస్థల్లో ఎలాంటి చెల్లింపులు జరపరాదని, కొత్త పనులకు మంజూరీ ఇవ్వరాదని, ముఖ్యంగా పెండింగ్ బిల్లులను కూడా చెల్లించరాదని, స్థానిక సంస్థ అప్పులు కూడా తీసుకోరాదని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు.

కమిషనర్ కర్ణన్..

చాలా వేగంగా విలీన ప్రక్రియను ముగించనున్నట్లు ఆయన స్పష్టం చేయగానే పట్టణ స్థానిక సంస్థల్లోని అక్రమార్కులు, ఆయా విభాగాల అధికారులు, కొందరు దళారులు ఆయన ఆదేశాలకు భిన్నంగా పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తయిన భవనాలకు జారీ చేయాల్సి అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగినట్లు దృష్టి రావటంతో కమిషనర్ కర్ణన్ స్టేట్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత మూడు నెలల్లో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, అక్యుపేన్సీ సర్టిఫికెట్ల జారీ పై విజిలెన్స్ విచారణ చేపట్టింది. దీంతో రంగంలో దిగిన స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారులు ఈ 27 పట్టణ స్థానిక సంస్థల్లో పెండింగ్ లో ఉన్న, నవంబర్ మాసంలో జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులతో పాటు అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పరిశీలించారు.

Also Read: Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

విజిలెన్స్ అధికారులు సమాచారం

విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అయిన నవంబర్ 25 తర్వాత ఆగ మేఘాలపై భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణంలో ఉన్న భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు, కొన్ని సర్కిళ్లలో ఇంటి నెంబర్లను కేటాయించినట్లు, మరి కొన్నింటిలో నిబంధనలకు విరుద్దంగా బిల్లుల చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ అనుమతులో పాటు అదే నెలలో దరఖాస్తు చేసుకున్న వారిని పిలిపించి మరీ అడ్డదారిలో నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా మణికొండ, నార్సింగి, నిజాంపేట్, బండ్లగూడ జాగీరు వంటి సర్కిళ్లలో భారీగా పర్మిషన్లు మంజూరు చేసినట్లు, నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్న భవనాలకు ముందస్తుగానే అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సైతం విజిలెన్స్ గుర్తించినట్లు తెలిసింది.

జీహెచ్ఎంసీని బూచిగా చూపి..

ఇప్పటి వరకు పట్టణ స్థానిక సంస్థగా కొనసాగిన ఆయా సర్కిళ్లలోని కొందరు అధికారులు జీహెచ్ఎంసీలోకి విలీనాన్ని బూచీగా చూపి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత అనుమతులు గానీ, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు నిబంధనల ప్రకారం రావన్న విషయాన్ని గుర్తించిన ఆయా స్థానిక సంస్థల్లోని అధికారులు దరఖాస్తుదారులను పిలిపించి ఇష్టారాజ్యంగా నిర్మాణ అనుమతులను మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. మణికొండ, నార్సింగి, నిజాంపేట్, బండ్లగూడ జాగీరు స్థానిక సంస్థల్లో అర్థరాత్రి వరకు కూడా అధికారులు తిష్ట వేసి నిబంధనలకు విరుద్దంగా నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు, ఈ లావాదేవీల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు కూడా గుర్తించారు.

అక్యుపెన్సీ సర్టిఫికెట్లు..

చాలా భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే అక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు కూడా గుర్తించిన సమాచారం, దానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్న విజిలెన్స్ అధికారులు త్వరలోనే అందుకు సంబంధించిన ఆధారాలతో కమిషనర్ కర్ణన్ కు నివేదికలను సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నివేదికను అనుసరించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. దీనికి తోడు నవంబర్ 25న విలీన ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, చెల్లింపులను కమిషనర్ నియమించనున్న ప్రత్యేక కమిటీ సమీక్షించి, ఆగమేఘాలపై, నిబంధనలకు విరుద్దంగా జారీ చేసిన నిర్మాణ అనుమతులతో పాటు జారీ అయిన అక్యుపెన్సీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read: Special Trains: దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటన

Just In

01

Mettu Sai Kumar: రాబోయే బిగ్ బాస్ సీజన్‌లో.. హరీశ్ రావు, కేటీఆర్‌కు చోటివ్వండి.. హీరో నాగార్జునకు లేఖ

Dhurandhar Boxoffice: బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ సునామీ.. రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్

Anasuya Viral Post: మిస్ అవుతున్నా.. స్విమ్ సూట్‌ వీడియో పెట్టి మరీ ట్రోలర్స్‌కు షాకిచ్చిన అనసూయ

Sankranti Holidays: గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు.. ఏకంగా 9 రోజులు హాలీడే

Director Teja: పాప్‌కార్న్ ధరలకు ప్రేక్షకుడు పరేషాన్.. దర్శకుడు తేజ ఏం అన్నారంటే?