Special Trains: ఆ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్: దక్షిణమధ్య రైల్వే
South-Central-Railway (Image source X)
Telangana News, హైదరాబాద్

Special Trains: దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటన

Special Trains: క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకలను పురష్కరించుకొని డిసెంబర్ చివరి వారం, జనవరి తొలి వారంలో చాలామంది స్వస్థలాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతుంటాయి. మరీ ముఖ్యంగా, సామాన్య ప్రయాణీకులు రైలు ప్రయాణాలకు మొగ్గుచూపుతుంటారు. దీంతో, ఈ ప్రత్యేక సీజన్‌లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణమధ్య రైల్వే (South Central Railway) కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ప్యాసింజర్ల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్ – ఎల్‌టీటీ ముంబై రూట్‌లో (Hyderabad – LTT Mumbai) ప్రత్యేక రైళ్లు (Special Trains) ప్రకటించింది. అదనపు ప్రయాణికుల జర్నీలను దృష్టిలో ఉంచుకొని, డిసెంబర్ 28న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఎల్‌టీటీ ముంబైకి ఒక ట్రైన్ షెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ట్రైన్ నంబర్ 07458 మరుసటి ఉదయం 10.40 గంటలకు ముంబై చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇక, డిసెంబర్ 29న సాయంత్రం 3.20 గంటలకు ట్రైన్ నంబర్ 07459 ముంబైలో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని వివరించింది.

స్టాప్స్ ఎక్కడెక్కడంటే?

ఈ స్పెషల్ ట్రైన్ స్టాపుల వివరాలను కూడా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వడి, కలబురిగి, షోలాపూర్, పుణే, కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతాయని తెలియింది. వచ్చే, వెళ్లే రెండు రైళ్లలోనూ ఇవే స్టాప్స్ ఉంటాయని వివరించింది. ఈ స్పెషల్ ట్రైన్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణమధ్య రైల్వే వివరించింది.

Read Also- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

9 జోన్లలో 138 స్పెషల్ ట్రైన్స్

కాగా, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశవ్యాప్తంగా 9 జోన్ల అంతటా కలిపి 138 ప్రత్యేక రైళ్లను నడపుతోంది. మొత్తం 650 ట్రిప్పులను ప్రతిపాదనలు చేసి, వాటికి ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం నాటికి మొత్తం 244 ట్రిప్పులను నోటిఫై చేశారు. అత్యధికంగా పశ్చిమ రైల్వేలో (Western Railway) 26 రైళ్లు నడుస్తాయి. దక్షిణ మధ్య రైల్వేలో 26 రైళ్లు, మధ్య రైల్వేలో 18 ట్రైన్స్, దక్షిణ తూర్పు మధ్య రైల్వేలో 12 రైళ్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా అదనపు సామర్థ్యం, సౌకర్యం, ప్యాసింజర్లకు సౌకర్యాలు కల్పిస్తున్నామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ అదనపు రైళ్ల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రిస్మస్, 2026 నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also- Shivaji Controversy: శివాజీ వ్యాఖ్యల దుమారంలో మాజీ సర్పంచ్ నవ్య ఎంట్రీ.. సెన్సేషనల్ వ్యాఖ్యలు

 

Just In

01

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల

Panchayat Election: ఖర్చులు పక్కాగా చూపాల్సిందే.. ఈ రూల్ తెలుసా?, లేదా?

Shambhala: ‘శంబాల’ సక్సెస్‌.. పుత్రోత్సాహంతో సాయి కుమార్ ఎమోషనల్..

Medak Cathedral Church: మెదక్ కేథడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు