Hydraa: యువ ఆపద మిత్రులు అంబర్‌పేటకు సోమవారం వచ్చారు. బతుకమ్మకుంటను సందర్శించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తకుండా, బతుకమ్మకుంట ఎలా కాపాడుతుందో హైడ్రా(Hydraa) అధికారులు వారికి వివరించారు. అంతేగాక, వరదలు వచ్చినప్పుడు చిక్కుకున్న వారిని బోటులో వెళ్లి ఎలా కాపాడాలో బతుకమ్మ కుంటలో ప్రాక్టీసు చేశారు. బోటులో కలియదిరిగారు. బతుకమ్మకుంట చరిత్రను తెలుసుకుని నివ్వెరపోయారు. కబ్జాలను తొలగించి, వేలాది ట్రక్కుల మట్టిని తీసి, ఇంత సుందరమైన చెరువును రూపొందించడం గొప్ప పరిణామమని వ్యాఖ్యానించారు. బతుకమ్మ ఆటలాడిన చిత్రాలను చూసి మురిసిపోయారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు
6వ రోజు శిక్షణలో భాగంగా..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనను తాను రక్షించుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని కాపాడేందుకు ఉద్దేశించిన యువ ఆపద మిత్ర శిక్షణలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌లోని పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థినులకు హైడ్రా శిక్షణ ఇస్తున్న విషయం విధితమే. వారం రోజుల శిక్షణలో భాగంగా ఆరవ రోజు బతుకమ్మకుంటను సందర్శించారు. అగ్ని ప్రమాదాలు ఎలా ఏర్పడతాయి? ప్రకృతి వైపరీత్యాల సమయంలో మొదటి రెస్పాండెంట్‌గా ఏం చేయాలి? ఎలా స్పందించాలి? ఎవరిని సంప్రదించాలి? ఇలా అనేక అంశాలపై అవగాహన తెచ్చుకున్నామని తెలిపారు. పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన వారు ఆహుతి అయిన ప్రాంతాలను కూడా సందర్శించారు. ఫతుల్లా గూడలో హైడ్రా(Hydraa) శిక్షణ ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని, మా మీద మాకు ఎంతో నమ్మకం, ధైర్యం వచ్చిందని ఈ సందర్భంగా పలువురు యువ ఆపద మిత్రలు తెలిపారు.
Also Read: Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు పని కల్పించడమేప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల!

