CPI Hyderabad: భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ జిల్లా కౌన్సిలర్ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల సిపిఐ ఉత్సవాల ర్యాలీ,బహిరంగ సభ అలంకరణకు సంబంధించి తోరణాలు జెండాలు ఫ్లెక్సీలతో అసెంబ్లీ హిమాయత్ నగర్ నారాయణగూడ ముస్తాబయింది. 100 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సిపిఐ ఉత్సవాల ర్యాలీ సభకు హైదరాబాద్ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు , కార్మికులు, విద్యార్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు.
Also Read: Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా
ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర
ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.హైదరాబాద్ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో త్యాగాలు చేసి హక్కులు సాధించిన నాయకుల స్ఫూర్తిని భవిష్యత్ తరానికి తెలిపే విధంగా సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది.సభ ఏర్పాట్లను ఈటీ నరసింహ తో పాటు సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకంటి శ్రీకాంత్ కౌన్సిల్ సభ్యులు బాలకృష్ణ పరిశీలించారు.
Also Read: MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

