Kerala News: వచ్చే ఏడాది ఏప్రిల్‌తో కేరళలో అధికార పార్టీ పదవీకాలం ముగుస్తున్నది. ప్రస్తుతం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI) అధికారంలో ఉన్నది. 2016లో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచింది. మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నది. అయితే, పంచాయతీ ఎన్నికలు ఆ ఆశలపై నీళ్లు జల్లినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్న యూడీఎఫ్
కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(CPI), సీపీఎం(CPM), కేసీఎం(KCM), జేడీఎస్(JDS), ఎస్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్(Congress) సెక్యులర్ పార్టీలు కలిసి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్)గా ఏర్పడి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీ, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్, కేసీ(జే), ఆర్ఎస్‌పీ, సఎంపీ(జే) పార్టీలు యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)గా ఏర్పడి బరిలో నిలిచాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) కూడా పోటీ చేసింది. వీటిలో యూడీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 941 గ్రామ పంచాయతీల్లో యూడీఎఫ్ 505, ఎల్‌డీఎఫ్ 340, ఎన్‌డీఏ 64 చోట్ల గెలవగా, ఇతరులు 6 స్థానాలు దక్కించుకున్నారు. 17,337 వార్డుల్లో యూడీఎఫ్ 7,996 చోట్ల గెలుపొందింది. ఎల్‌డీఎఫ్ 6,555 వార్డులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 162 బ్లాక్ పంచాయతీల్లో యూడీఎఫ్ 79, ఎల్‌డీఎఫ్ 63 చోట్ల గెలవగా, 10 స్థానాల్లో టై అయింది. జిల్లా పంచాయతీల్లో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ చెరో 7 కైవసం చేసుకున్నాయి. ఇక, 87 మున్సిపాలిటీల్లో యూడీఎఫ్ 84 దక్కిచుకోగా, ఎల్‌డీఎఫ్ 28, ఎన్‌డీఏ రెండు చోట్ల గెలిచాయి. 6 కార్పొరేషన్లలోనూ యూడీఎఫ్ సత్తా చాటింది. 4 చోట్ల గెలిచింది. ఎల్‌డీఎఫ్ ఒక చోటే గెలవగా, రాజధాని తిరువనంతపురంలో ఎన్‌డీఏ సత్తా చాటింది.
Also Read: Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్‌కు పండగే..
నెక్స్ట్ గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనా?
తాజా ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయనే చర్చ జోరుగా జరుగుతున్నది. కేరళలో 2004 నుంచి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నది. 2021లో మాత్రం సీపీఐ రెండోసారి గెలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని స్థానిక ఎన్నికల ఫలితాలు చూశాక రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు మూడోసారి ఛాన్స్ దక్కే అవకాశం లేదని అంటున్నారు.
Also Read: Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

