Dandora Movie Trailer: బిగ్‌బాస్ రియాలిటీ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్న నటుడు శివాజీ, వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ట్రైలర్ గమనిస్తే, ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది. సమాజంలో జరిగే కొన్ని ముఖ్యమైన పరిణామాల చుట్టూ కథాంశం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. శివాజీ తన మార్క్ నటనతో సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, నవదీప్, నందు, రవికృష్ణల పాత్రలు కథకు బలాన్నిచ్చేలా ఉన్నాయి.
Read also-Shambala Movie: ‘శంబాల’ థియేటర్‌లో మంచి ఎక్సీపిరియన్స్ చేస్తారు.. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల..
ముఖ్య పాత్రల్లో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మణిక, మౌనిక రెడ్డి, రాధ్య, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. ప్రతి పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించడంతో, ‘దండోరా’ పై కూడా ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. శ్రీమతి ముప్పనేని శ్రీలక్ష్మి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
Read also-BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. ఫ్యామిలీ టచ్ అదిరిందిగా..

