Rajagopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
Rajagopal-Reddyy (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Rajagopal Reddy: మంత్రి పదవిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆశించడమే కాదు, గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తన అసంతృప్తిని వెలిబుచ్చుతూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా రుసరుసలాడిన సందర్భాలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అమాత్య భాగ్యం మాత్రం ఇంకా దక్కలేదు. ఆయనకు పదవి కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి త్వరలోనే దక్కుతుందన్న గట్టి నమ్మకాన్ని వెలిబుచ్చారు.

త్వరలోనే మంత్రి పదవి: రాజగోపాల్ రెడ్డి

వచ్చే నెల జనవరిలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండవచ్చంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇన్ని రోజులు ఆగాను. మనకు కూడా అదృష్టం ఉంటది తప్పకుండా. ఇంతకంటే మంచి పదవి వస్తది. త్వరలోనే వస్తుంది మంత్రి పదవి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. ఆయన ఎక్కడ మాట్లాడారనేది నిర్దిష్టంగా తెలియరాలేదు, కానీ, ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన ఓ అభ్యర్థిగా మద్దతుగా మాట్లాడే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తోంది. ముఖంలో చిరునవ్వుతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.

Read Also- Revenge Crime: రెండు కుటుంబాల మధ్య పగ.. ఇటీవలే ఒక హత్య.. పోస్టుమార్టం నిర్వహించగా…

తన అనుచరులు, పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా?, లేక, అధిష్టానం నుంచి హామీ లభించిందా? అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. మంత్రి పదవి విషయమై గతంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సంతోషంగా, కాన్ఫిడెన్స్‌గా పదవి వస్తుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే మంత్రి పదవి దక్కుతుందా?, లేక, ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఇంకేమైనా ఆంతర్యం ఉందా? అనేది చూడాలి.

 ఆశాభంగం

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి రేసులో రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. అయితే, ఆ భాగ్యం మాత్రం ఆయనకు దక్కడం లేదు. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు (ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిపి) ఉండటంతో సామాజిక, ప్రాంతీయ, రాజకీయ సమీకరణాలు రాజగోపాల్ రెడ్డికి ప్రతికూలంగా మారాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరగగా, రెండు సార్లూ ఆయనకు మొండిచెయ్యి ఎదురైంది. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామంటూ పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు గుర్తుచేశారు. దీంతో, రెండో విడత కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కకపోడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read Also- Pawan Kalyan: సుజిత్‌కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చింది అందుకే!.. సినిమా కోసం అంతపని చేశాడా?

Just In

01

Vithika New House: వరుణ్ సందేశ్ కలల సౌధాన్ని చూశారా.. ఏం ఉంది బాసూ..

MLA Anirudh Reddy : కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే కన్నెర్ర చేస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..

KTR: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమయ్యాయి: కేటీఆర్

Leopard in Naravaripalli: నారావారిపల్లెలో చిరుత సంచారం.. సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలోనే..