Sigma Movie Update: టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా, దర్శకుడు జేసన్ విజయ్ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’ (Sigma). భారీ బడ్జెట్‌తో, సరికొత్త సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని, ప్రమోషన్ల దిశగా అడుగులు వేస్తోంది. గత కొద్ది నెలలుగా వివిధ ప్రాంతాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకున్న ‘సిగ్మా’ బృందం, తాజాగా ‘ప్యాకప్’ చెప్పేసింది. షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు సౌండ్ డిజైనింగ్‌కు ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉండటంతో, దర్శకుడు జేసన్ విజయ్ ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
సినిమాపై అంచనాలు పెంచేలా చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సందీప్ కిషన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ ఫుల్ మరియు ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నారు. డార్క్ థీమ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చూస్తుంటే, దర్శకుడు ఒక భారీ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి “సందీప్ కిషన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లోడింగ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిత్ర ప్రమోషన్లలో భాగంగా మూవీ టీం ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 23, 2025న ‘సిగ్మా’ టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ పండుగ సందడికి ముందే ఈ టీజర్ ద్వారా సినిమా అసలు థీమ్ ఏమిటో వెల్లడించనున్నారు. ఇప్పటికే వైరల్ అవుతున్న వీడియోతో అంచనాలు భారీగా పెరగగా, టీజర్ ఆ అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. జేసన్ విజయ్ కి ఇది మొదటి సినిమా , తండ్రి దళపతి విజయ్ బాటలో హీరో గా రాకుండా జేసన్ విజయ్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
SIGMA shoot wrapped 🎬✨
Get ready for the Teaser on 23.12.25 at 5 PM.@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee @Cinemainmygenes @krishnanvasant… pic.twitter.com/aua7GieWwR— Lyca Productions (@LycaProductions) December 19, 2025

