Mobile Recharge: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్..
Mobile Recharge ( Image Source: Twitter)
బిజినెస్

Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు మరోసారి ధరల పెంపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, Jio, Airtel, Vi వంటి టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 16 శాతం నుంచి 20 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది గత ఎనిమిదేళ్లలో నాలుగోసారి టారిఫ్‌లు పెరగడం కావడం గమనార్హం. ఈ పెంపు 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు 4G, 5G ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లన్నింటికీ వర్తిస్తాయి.

Also Read: Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాపై పాన్ ఇండియా దర్శకుడు ప్రశంసలు..

ధరల పెంపు యూజర్ల జేబుపై నేరుగా ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ప్రస్తుతం రూ.299గా ఉన్న Jio 28 రోజుల 1.5GB/డే ప్లాన్ ధర పెరిగితే రూ.347 నుంచి రూ.359 మధ్యకు చేరవచ్చు. అలాగే రూ.349 ఉన్న అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ ధర రూ.405 నుంచి రూ.419 వరకు పెరగవచ్చు. Airtel, Vi వినియోగదారులకు కూడా ఇదే తరహా పెంపు ఉండే అవకాశం ఉంది. దీని ఫలితంగా సాధారణ మొబైల్ యూజర్‌కు నెలకు అదనంగా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది, వార్షికంగా చూస్తే ఇది దాదాపు రూ.800కు పైగా భారం కావచ్చు.

Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్‌కు న్యూ ఇయర్​ ఈవెంట్ పాస్​ వచ్చిందా? సైబర్ కేటుగాళ్ల కొత్త స్కెచ్ జాగ్రత్త!

టెలికాం కంపెనీలు ధరలు పెంచడానికి ప్రధానంగా 5Gపై చేసిన భారీ పెట్టుబడులే కారణంగా నిపుణులు చెబుతున్నారు. 2022లో జరిగిన 5G స్పెక్ట్రమ్ వేలంలో కంపెనీలు కలిపి సుమారు రూ.1.5 లక్షల కోట్లను ఖర్చు చేశాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ విస్తరణకు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రారంభ దశలో యూజర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలకు, కొన్నిచోట్ల అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందించారు. ప్రస్తుతం Jio, Airtel‌లలో 5G వినియోగదారుల శాతం ఎక్కువ పెరగడంతో, ఇప్పుడు ఆ పెట్టుబడుల నుంచి ఆదాయం రాబట్టేందుకు టారిఫ్‌లు పెంచుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మొత్తంగా చూస్తే, వచ్చే ఏడాది నుంచి మొబైల్ రీఛార్జ్ ఖర్చులు మరింత పెరగడం నిజమేనని తెలుస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ ఖర్చులకు ముందుగానే ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

 

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్