Hyderabad Crime: మాయమాటలతో కిడ్నాప్‌చేసి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం ఇది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు నిందితుడైన మైనర్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై కిడ్నాప్, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే, బిహార్‌కు చెందిన ఓ కుటుంబం ఉపాధిని వెతుక్కుంటూ కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి జల్‌పల్లి ప్రాంతంలో స్థిరపడింది. కూలీ పని చేస్తూ కుటుంబ పెద్ద భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా పద్నాలుగేళ్ల వీరి చిన్న కూతురికి స్థానికంగా ఉండే ఓ పదిహేనేళ్ల బాలునితో పరిచయం అయ్యింది.
తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు
ఈనెల 12న సాయంత్రం 4 గంటల సమయంలో ఇప్పుడే వస్తానని తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఉంటున్న ప్రాంతంలోనే నివాసముంటున్న బాలునిపై అనుమానాలు ఉన్నట్టుగా తెలిపారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలిసి నిందితుడు ఆ మరుసటి రోజు ఉదయం బాధితురాలిని ఆమె ఇంటి వద్ద వదిలేసి పరారయ్యాడు.
Also Read: Hyderabad Crime: పవిత్ర హత్య కేసులో ట్విస్ట్.. మద్యం మత్తులో ఘాతుకం.. కేసును ఛేదించిన పోలీసులు!
రాత్రంతా ఎక్కడికెళ్లావ్?
రాత్రంతా ఎక్కడికెళ్లావ్? అని తల్లిదండ్రులు నిలదీయగా, బాలిక తనను జల్‌పల్లిలోనే ఓ ప్లాస్టిక్ పరిశ్రమకు తీసుకెళ్లిన నిందితుడు అక్కడ తనపై అత్యాచారం జరిపినట్టుగా తెలిపింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడైన మైనర్‌కు అతని సోదరుడు, ప్లాస్టిక్ కార్ఖానా యజమాని సహకరించినట్టుగా వెల్లడైంది. పోలీసులు నిందితునితోపాటు సహకరించిన మరో ఇద్దరిపై కిడ్నాప్, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించారు.
Also Read: Hyderabad Crime: గంజాయి దందాలో ఎక్స్‌పర్ట్ లేడీ డాన్.. నీతూ భాయ్ అరెస్ట్..!
పీహెచ్‌బీలో బాలికపై లైంగిక దాడి
మైనర్బాలికను మాయ మాటలతో లోబరుచుకున్న ఓ వ్యక్తి ఆ చిన్నారిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకెళితే, కేపీహెచ్‌బీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మైనర్‌బాలిక ఇటీవల రైలులో సొంతూరి నుంచి వస్తుండగా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తీయగా మాట్లాడి బాలిక మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత తరచూ ఆమెకు ఫోన్లు చేస్తూ వచ్చిన ఆ వ్యక్తి బాధితురాలి ఇంటికి వచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దాంతో అసలేం జరిగింది?
కాగా, ఇటీవల ఊర్లో ఉంటున్న చిన్నమ్మ ఇంటికి వెళ్లిన బాధితురాలు, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. దాంతో అసలేం జరిగింది? అని కుటుంబ సభ్యులు ప్రశ్నించటంతో జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Also Read: Hyderabad Crime: రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంటికి కన్నం.. తాళ్లతో కట్టేసి కర్రలతో దాడి

