Hyderabad Crime: నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్‌లో పంజా విసిరింది. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంట్లో పనికి కుదిరి పదిహేను రోజుల్లోనే దోపిడీకి పాల్పడింది. ఇంటి యజమానికి మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత తాళ్లతో కట్టేసి 25 తులాల బంగారు నగలు, రూ.23 లక్షల నగదును దోచుకుని ఉడాయించింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఖార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న గిరి (75) ఆర్మీలో కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇంతకు ముందు ఇంట్లో పని చేసిన వాళ్లు ఉద్యోగం మానేయడంతో పదిహేను రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు రాజు, పూజలను పనిలో పెట్టుకున్నారు. నమ్మకంగా పని చేస్తున్నట్టు నటించిన రాజు, పూజ ఇంట్లో బంగారు నగలు, నగదు ఎక్కడ దాచి పెడుతున్నారన్న విషయాలు తెలుసుకున్నారు. శనివారం రాత్రి గిరి ఇంట్లో ఒంటరిగా ఉండగా నేపాల్‌కు చెందిన మరో నలుగురిని పిలిపించుకున్నారు.
Also Read: Suresh Controversy: పవన్ పేషీలో అవినీతి కార్యకలాపాలంటూ వైసీపీ ఆరోపణ.. జనసేన రియాక్షన్ ఇదే
మత్తు మందు తాగించే ప్రయత్నం..
చీకటి పడ్డాక కారులో వాళ్లు రాగా ఇంట్లోకి తీసుకెళ్లారు. గిరికి మత్తు మందు తాగించే ప్రయత్నం చేయగా ఆయన దానిని అడ్డుకున్నాడు. దాంతో గిరిని కొట్టి మత్తు మందు తాగించారు. ఇంట్లో పని చేస్తున్న మరో మహిళకు కూడా మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత గిరి ఒంటిపై ఉన్న బంగారంతోపాటు బీరువాలో ఉన్న 25 తులాల నగలు, రూ.23 లక్షలు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఆదివారం ఉదయం ఇరుగుపొరుగు సహాయంతో తాళ్లు విప్పుకొన్న గిరి జరిగిన దోపిడీపై కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Also Read: MLC Kavitha: రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని కవిత డిమాండ్..!
