Janaseana Vs YSRCP (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Suresh Controversy: పవన్ పేషీలో అవినీతి కార్యకలాపాలంటూ వైసీపీ ఆరోపణ.. జనసేన రియాక్షన్ ఇదే

Suresh Controversy: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేషీలో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ విపక్ష వైసీపీ (YSRCP) నాయకులు గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ పేషీలో పనిచేస్తున్నానని చెబుతూ సురేష్ అనే వ్యక్తి ప్రభుత్వ పథకాలు, అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో డబ్బులు తీసుకున్నాడంటూ అంటున్నారు. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారంపై (Suresh Controversy) జనసేన ఆదివారం స్పందించింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో సురేష్ అనే వ్యక్తి ఎవరూ లేరని, పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్టుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ప్రకటన చేసింది.

Read Also- Paddy Harvest Delay: ఇనుగుర్తి మండలంలో రైతుల ఇక్కట్లు.. ప్రారంభం కాని వరి కోతలు..!

గతంలోనూ ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు, ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై,నిజానిజాలు నిర్ధారించుకోకుండా ప్రచురించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని వివరించింది.

Read Also- Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు

వైసీపీ ఆరోపణ ఏంటి?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పేషీలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడ్డాడని, ముఖ్యంగా అధికారుల బదిలీలు, ఇతర పనుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపించారు. అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ కార్యాలయంలోనే ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే, ఈ ప్రచారం ఉత్తదేనని జనసేన చెబుతోంది. ఉప ముఖ్యమంత్రి పేషీలో పనిచేయని సురేష్ అనే వ్యక్తి పేరును ఉపయోగించి వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Vasudeva Sutham Song: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ నుంచి ‘ఏమైపోతుందో’ సాంగ్ రిలీజ్..

Keerthy Suresh: యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులైన కీర్తీ సురేశ్..

MLA Mynampally Rohit: క్రీడలతో పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ హోరాహోరీ పోరు..!

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే..