Hyderabad Crime: గంజాయి దందాలో లేడీ డాన్ గా పేరున్న నీతూబాయి ఇంటిపై మంగళవారం ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి జరిపారు. తనిఖీలు చేసి 786గ్రాముల గంజాయితోపాటు 110 బాటిళ్ల బీర్లు, బ్రీజర్లు, బైక్, 60,890 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధూల్ పేటలో వరుసగా దాడులు జరుగుతుండటంతో నానక్ రాంగూడకు మకాం మార్చిన నీతూబాయి గంజాయి దందా కొనసాగిస్తూ వస్తోంది. ఈ మేరకు సమాచారం అందటంతో ఎస్టీఎఫ్ బీటీం లీడర్ ప్రదీప్ రావు, సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి దాడి జరిపారు. నీతూబాయితోపాటు ఆమె కొడుకు దుర్గాప్రసాద్, గోవింద్. దుర్గేశ్ లను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి శేరిలింగంపల్లి ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
మాన్ గార్ బస్తీలో..
గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏటీం లీడర్ అంజిరెడ్డి మంగళవారం సిబ్బందితో కలిసి దాడి జరిపారు. ఒడిషా(Odhisha)కు చెందిన కాండ్లే పరిమళ, బసంతిలను అరెస్ట్ చేసి 1.2కిలోల గంజాయిని సీజ్ చేశారు. కాగా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న సాకేత్ బాబు, కాంబ్లే మురళీ పరారయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. ఇక, శేరిలింగంపల్లి నెహ్రూనగర్‌లో మంగ్లీ నరేశ్ ఇంట్లో గంజాయి పెట్టుకుని అమ్ముతుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ సీ టీం ఎస్ఐ మంజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. 710 గ్రాముల గంజాయిని సీజ్ చేసి నరేశ్ ను అరెస్ట్ చేశారు.
Also Read: Hyderabad Crime News: నగరంలో తీవ్ర విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!

