Fake Death Scam: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాతూర్ ఆర్సా తాలూకా పోలీసులు ఆదివారం రాత్రి పూర్తిగా దగ్ధమైన కారులో ఒక మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకోగా, అక్కడికి వెళ్ళి చూసిన పోలీసులు కంగుతిన్నారు. కారు యజమాని తన సొంత సంబంధికుడికి కారును అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, మంటలు చెలరేగిన కారులో.. ఒక బాడీని పోలీసులు గుర్తించారు. గణేష్ చవాన్ అనే వ్యక్తి ఇంటికి రాకుండా, ఫోన్ ఆఫ్ అయినట్లు కుటుంబం చెప్పినందున, మొదట ఆయన మరణించినట్టే అనుకున్నారని లాతూర్ సూపర్‌టిండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అమోల్ తాంబే తెలిపారు.
ప్రేయసి చాట్స్ నుంచి నిజం బయటకు
సోమవారం, పోలీసులు ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు. గణేష్ చవాన్ ఒక మహిళతో సంబంధంలో ఉన్నారని తెలిసింది. ఆ మహిళను పోలీసులు విచారించగా, చవాన్ ఘటన తర్వాత కూడా ఆమెకు మరో ఫోన్ నంబర్ మెసేజ్ లు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. దీనివల్ల చవాన్ బతకుతున్నట్టు నిర్ధారణ అయింది. అతని కొత్త ఫోన్ నంబర్‌ను అనుసరించి, చవాన్ కొల్హాపూర్ సింధుదుర్గ్ జిల్లాలోని విజయదుర్గ్‌కి వెళ్ళిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
ఈ నాటకంలో నిజమైన హత్య కూడా..
పోలీసుల విచారణలో, చవాన్ రూ.1 కోట్ల జీవన బీమా పాలసీ తీసుకున్నట్లు తెలిసింది. దీని నుంచి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో హోమ్ లోన్ తీర్చాలని ప్లాన్ చేసినట్లు తేలింది. దీని కోసం తానే చనిపోయినట్టు నటిస్తూ హిక్కహైకర్‌ను హత్య చేశాడు. శనివారం, చవాన్ తులజాపూర్ టి-జంక్షన్ వద్ద హిక్కహైకర్ గోవింద్ యాదవ్‌కు లిఫ్ట్ ఇవ్వగా, యాదవ్ మద్యం తాగి కారు లోపలే నిద్రపోయాడు. ఆ తర్వాత చవాన్ అతన్ని డ్రైవర్ సీటు లో కూర్చో పెట్టి సీట్బెల్ట్ పెట్టి, సీటుపై ప్లాస్టిక్ బ్యాగ్‌లు పెట్టి మంటపెట్టాడు. తన కుటుంబాన్ని మోసం చేసేందుకు చవాన్ చనిపోయినట్టు చూపించడానికి ఇలా చేసినట్లు ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు హత్య కేసు నమోదు చేసాం. చవాన్‌కు ఏమైనా సహచరులు ఉన్నారా అని తదుపరి విచారణ చేస్తున్నాం అని SP తాంబే చెప్పారు.

