Panchayat Elections: గుర్తులు పోలిన గుర్తులు.. అభ్యర్థుల్లో దడ
Panchayat-Elections
Telangana News, లేటెస్ట్ న్యూస్

Panchayat Elections: గుర్తులు పోలిన గుర్తులు.. అభ్యర్థుల్లో గుండె దడ.. మూడవ దశ పంచాయతీ ఎన్నికల సర్వంసిద్ధం!

Panchayat Elections: గుర్తు.. గుర్తుంచుకో

అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం

బ్యాలెట్ పత్రాల్లో పేర్లు, ఫోటోలకు బదులు గుర్తులు మాత్రమే ముద్రణ

గుర్తులతో అభ్యర్థుల ముమ్మర ప్రచారం

ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

గద్వాల, స్వేచ్ఛ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల గుబులు (Panchayat Elections) పట్టుకుంది. పంచాయతీ  ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కీలకమే కావడంతో ఓటర్లు గుర్తులను గుర్తించుకునేలా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నచోట పెద్దగా ఇబ్బంది లేకపోయినా అంతకుమించి అభ్యర్థులు ఉన్నచోట క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం పట్టుకుంది. సర్పంచ్‌కు,వార్డ్ మెంబర్ కోసం మరొక బ్యాలెట్ ఉండడం ఓటర్లు రెండింటిపై ఓట్లు వేయాల్సి రావడంతో గుర్తుల విషయంలో కొంతమంది ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదని, గత రెండు విడుతల ఎన్నికలలో సైతం అనేక ఓట్లు చెల్లనిగా నమోదయ్యాయి. కొన్ని గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నిరక్షరాష్యులు, వృద్ధుల ఓట్ల గురించి అభ్యర్థులకు బెంగ పట్టుకుంటోంది. ఒక గుర్తు అనుకొని మరొక గుర్తుకు ఓటు వేస్తే ఫలితాలు తలకిందులు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also- MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

మెజార్టీ ఓటర్లకు గుర్తు గట్టిగా గుర్తుండి పోయేలా ఓటర్లు మర్చిపోకుండా ఒకటికి రెండుసార్లు అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ బ్యాలెట్ నమూనా పత్రాలు, డోర్ పోస్టర్లు, కరపత్రాలతో పాటు బ్యానర్లు ప్రదర్శించారు. ఆటోలు పెట్టి మైకుల ద్వారా పాటలు పెట్టి గుర్తుల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు ఫోటోలు ఉంటాయి కానీ పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తారు. బ్యాలెట్లలో వరుస క్రమంలో కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి. అభ్యర్థుల పేర్లు ఫోటోలు కానరావు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు గుర్తుకు రాకుంటే మాత్రం ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి పడుతుంది. ఫలితంగా అభ్యర్థుల జాతకాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది.దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తును గుర్తుండేలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బ్యాలెట్ నమూనా పత్రాలు ప్రతి ఇంటికి పోస్టర్లు కరపత్రాలతో పాటు బ్యానర్లు కట్టి ప్రచారాన్ని మూడు విడతలలో ముమ్మరం చేశారు. దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ ప్రతి ఒక్కరికి తమ గుర్తు కత్తెర, ఉంగరం, బాల్, తదితర గుర్తులను చూపుతూ ప్రచారాన్ని నిర్వహించి తమను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Read Also- MLC Kavitha: ఒకవేళ సీఎం అయితే కొత్తగా ఏం చేస్తారు?.. ఎమ్మెల్సీ కవిత సమాధానం ఇదే

సోషల్ మీడియాలో ప్రచార హోరు

గ్రామాల్లో ఎన్నికల వాతావరణం చివరి దశకు చేరింది. పోటీదారులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిన్నటితో ప్రచారానికి గడువు ముగిసింది రోడ్ల వెంట వెళ్లే వారిని సైతం పలకరిస్తూ వారికి ఏ అవసరం ఉన్నా తీరుస్తూ అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఏ అవకాశం దొరికిన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సామాజిక మాధ్యమాలే వేదికగా ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతుంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు సర్పంచ్ ఎన్నికలవేళ అభ్యర్థుల పేర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఆయా గ్రూపుల్లో తమ ప్రచారాలు, గ్రామ అభివృద్ధి పై ఓటర్లు వారి అభిప్రాయాలు నేతల సందేశాలు హామీలు రోజువారి కార్యక్రమాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థులు పెట్టే పోస్టులకు సమాధానంగా మరికొన్ని పోస్టులు పెడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి మద్దతుదారులు కుటుంబ సభ్యులు వీటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. అభ్యర్థుల అనుచరులు గ్రూపులను క్రియేట్ చేసి ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ గుర్తులను పెడుతూ గుర్తించుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల ఫోటోలు ప్రత్యేక ఆకృతులను రూపొందించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ అభివృద్ధి చేస్తామని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. అభ్యర్థులు మామూలు ప్రచారం కంటే సోషల్ మీడియా ద్వారానే ప్రచారం ముమ్మరం చేసుకుంటున్నారు.

Just In

01

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

Ward Member Dies: గెలిచిన రోజే వార్డు సభ్యుడి మృతి.. విషాద ఘటన

Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..

Chandrababu Naidu: కన్హా శాంతివనంలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఆశ్రమం సందర్శన