Drug Bust: డెలివరీ బాయ్స్​ ముసుగులో గంజాయి దందా.
Drug Bust ( image CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Drug Bust: డెలివరీ బాయ్స్​ ముసుగులో గంజాయి దందా.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్!

Drug Bust: డెలివరీ బాయ్స్​ గా పని చేస్తూ తేలికగా డబ్బు సంపాదించటానికి అడిగిన వారికి గంజాయి అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంతోపాటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలకు చెందిన శ్రీకాంత్​, కిశోర్​, ఉమేశ్​ కుమార్, సయ్యద్ అన్వర్, సింహాచలరావు, అమర్​, జోయ అలీ, మహ్మద్ అలీ, ఇర్పాన్, బాబుల్​ పురి కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు.

హోటళ్లలో ఉద్యోగులు

కొందరు డెలివరీ బాయ్స్​ గా పని చేస్తుండగామరికొందరు హోటళ్లలో ఉద్యోగులుగా చేరారు. ఈ క్రమంలో ఒకరికొకరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరందరికీ గంజాయి సేవించే అలవాటు ఉండటంతో తరచూ కలుసుకునే వారు. కాగా, చేస్తున్న పనుల్లో ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో అంతా కలిసి గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బీదర్, ఒడిషా నుంచి గంజాయి కొని తెచ్చి మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో అడిగిన వారికి అమ్ముతూ వస్తున్నారు.

Also Read: Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్​.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!

ఆహార పదార్థాలను డెలివరీ

ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ ఏ టీం లీడర్​ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి గ్యాంగులోని శ్రీకాంత్, కిశోర్​, ఉమేశ్​ కుమార్​, సయ్యద్ అన్వర్​, సింహాచలరావు, అమర్​ లను బంజారాహిల్స్​ లోని ఎస్​ఎస్ కాంప్లెక్స్​ సర్వీస్​ అపార్ట్​ మెంట్ నుంచి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగితా నిందతుల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను బంజారాహిల్స్​ ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు. కాగా, సరుకులు, ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్న కంపెనీలకు లేఖలు రాయాలని ఎక్సయిజ్​ ఎన్ ఫోర్స్​ మెంట్ డైరెక్టర్​ షానవాజ్​ ఖాసీం సిబ్బందికి సూచించారు. డెలివరీ బాయ్స్​ గా పని చేస్తున్న వారిపై ఆయా కంపెనీలు కన్నేసి పెట్టాలని వారికి చెప్పాలన్నారు. ఎవరైనా గంజాయి, ఇతర డ్రగ్స్​ తో కనిపిస్తే వెంటనే సమాచారం పంపించేలా చూడాలని పేర్కొన్నారు.

Also Read: Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క