Additional DCP Ramanujam: పంచాయతీ ఎన్నికలకు పోలీస్ అలర్ట్
Additional DCP Ramanujam ( image credit: swetcha reporter)
Telangana News

Additional DCP Ramanujam: పంచాయతీ ఎన్నికలకు పోలీస్ అలర్ట్.. నియమాలు ఉల్లంఘిస్తే తక్షణ చర్యలు

Additional DCP Ramanujam: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం (Additional DCP Ramanujam) అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది యొక్క విధివిధానాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల భద్రత అనేది సమష్టి బాధ్యతని, ఎన్నికలను విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

Also Read: Traffic DCP: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించటంతో పాటు..?

వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దు 

విధినిర్వహణలో సిబ్బందికి ఏదైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల విధులలో ఎలాంటి అలసత్వం లేకుండా క్రమశిక్షణతో తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధులలో సిబ్బంది చేయవలసినా, చేయకూడని విధుల గురించి ముఖ్యమైన అంశాలను ఈ సందర్బంగా వివరించారు.

Also Read:Crime News: చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్య.. వీడిన మిస్టరీ!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క