India Vs South Africa: తొలి టీ20లో టాస్ దక్షిణాఫ్రికాదే.. ముందుగా..
Ind-Vs-SA (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India Vs South Africa: తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

India Vs South Africa: భారత్, దక్షిణాఫ్రికా మధ్య (India Vs South Africa) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9, 2025) తొలి మ్యాచ్ షురూ అయ్యింది. మ్యాచ్‌లో కీలకమైన టాస్ అప్‌డేట్ వచ్చేసింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) ముందుగా బౌలింగ్ చేస్తామని వెల్లడించాడు. దీంతో, టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు ఇవే..

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్ర‌మ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డానోవన్ ఫెరీరా, మార్కో యన్సెన్, కేశవ్ మహారాజ్, లుథో సిపామ్లా, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే.

భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు చోటుదక్కలేదు.

Read Also- Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి జరగడం ఖాయం : మంత్రి ధనసరి సీతక్క

జట్టు ఎంపిక తలనొప్పి: సూర్య కుమార్ యాదవ్

తుది జట్టు ఎంపిక కెప్టెన్‌గా చాలా తలనొప్పి అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఆడడంలేదని తెలిపాడు. ‘‘పిచ్ చూసి మేం కొద్దిగా గందరగోళానికి గురయ్యాం. నిన్న కాస్త పచ్చగా కనిపించింది. కానీ ఇవాళ కొంచెం అయోమయంగా అనిపిస్తోంది. పర్లేదు, ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషిస్తున్నాం. స్కోరు బోర్డుపై పరుగులు మంచి స్కోర్ సాధించి, దానిని డిఫెండ్ చేయడం మాకు సవాలు అనే చెప్పాలి. నా ఉద్దేశంలో, మంచు (Dew factor) అంశం బౌలర్లకు కొంచెం సవాలుగా మారుతుంది. ఈ విషయాన్ని మనం కాదనలేం. పిచ్‌పై దృష్టి పెడితే మ్యాచ్ గెలవడం కష్టమవుతుంది. కాబట్టి, దాని గురించి ఆలోచించకుండా, దాన్ని ఒక సవాల్‌గా తీసుకుంటాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ‘‘ ఆస్ట్రేలియాలో చక్కగా సిరీస్ ఆడాం. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో 5 టీ20లు ఆడతాం. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడతాం. అంటే మొత్తం 15 మంచి టీ20 మ్యాచ్‌లు. ఇవి టీ50 ప్రపంచ కప్‌కు మంచి సన్నాహంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. భయం లేకుండా ఆడటం, ఆటను ఆస్వాదించడం… తర్వాతి మూడు మా దృష్టి వీటిపైనే ఉంటుంది’’ అని చెప్పాడు.

Read Also- Rahul Gandhi – RSS: ‘సర్’పై లోక్‌సభలో చర్చ… ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో దుమారం

ఆసక్తికర విషయం ఏంటంటే, కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా ఇదివరకు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడగా, ఈ రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఈ రికార్డును భారత్ ఈ రోజు తిరగరాస్తుందా?, లేక, మరోసారి ఓటమిని చవిచూస్తుందా? అనేది మరో 3 గంటల్లో తేలిపోనుంది.

 

Just In

01

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

Ward Member Dies: గెలిచిన రోజే వార్డు సభ్యుడి మృతి.. విషాద ఘటన