Actor kamal haasan Movie After 30 Years marudhanayagam
Cinema

Kamalhaasan: చాలా గ్యాప్‌ తరువాత రీ-ఎంట్రీ

Actor kamal haasan Movie After 30 Years marudhanayagam: లోకనాయకుడు కమల్‌హాసన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో మరుదనాయకం మూవీ ఒకటి. 1991లో అనౌన్స్ చేసిన ఈ మూవీ 1997లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కమల్‌హాసన్ స్వయంగా ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు.

అయితే ఫైనాన్సియల్‌ ఇష్యూస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ మిడిల్‌లోనే ఆగిపోయింది. కొంత ఖర్చు చేసిన తరువాత ఆ ప్రాజెక్టు హఠాత్తుగా ఆగిపోవడం కమల్‌కు చాలా సమస్యలను తీసుకువచ్చింది. ఇటీవల ఇండియన్ 2 మూవీ ప్రమోషన్‌లో భాగంగా కమల్‌హాసన్ మరుదనాయకం గురించి ఇంట్రెస్టింగ్‌ మ్యాటర్‌ని రివీల్ చేశాడు. 106 ఏళ్ల సేనాపతిగా యాక్ట్ చేస్తున్న కమల్, మరోసారి మరుదనాయకం ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేసే ఛాన్స్ గురించి హ్యూమర్‌ ఫుల్‌గా మాట్లాడారు. కమల్‌హాసన్ తన చరిత్రాత్మక రోల్ అయిన ముహమ్మద్ యూసఫ్ ఖాన్ పాత్రను 70 ఏళ్ల వయస్సులోనూ తానిచ్చిన సవాలు ఎలా ఉంటుందో అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

Also Read: మూవీపై క్లారిటీ

అయితే ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సూచించినా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరుదనాయకం స్క్రీన్‌ పైకి వస్తే ఈ మూవీ భారతీయ చరిత్రలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మూవీగా నిలిచిపోనుందని కమల్ నమ్మకం.ఇక ఈ మూవీ స్టార్టింగ్‌ బడ్జెట్ రూ. 85 కోట్లుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. మరుదనాయకం పునఃప్రారంభం కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..