Good News, Fighter Movie Entry on OTT
Cinema

Fighter Movie : గుడ్‌న్యూస్, ఓటీటీలోకి ఫైటర్

Good News, Fighter Movie Entry on OTT: బాలీవుడ్ అగ్రకథానాయకుడు గ్రీకువీరుడు హృతిక్ రోషన్, అందాలతార దీపికా పదుకొణే జంటగా యాక్ట్ చేసిన మూవీ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ మూవీలో అనిల్ కపూర్, బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌లు మెయిన్ రోల్స్‌ పోషించారు. జనవరి 26 కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఫైటర్ సూపర్ హిట్‌ మూవీగా బాలీవుడ్‌లో నిలిచింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద హృతిక్ రోషన్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఫైటర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా?అని ఆడియెన్స్ ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు.

ఇక ఈ మూవీ థియేటర్లలో రిలీజై సుమారు రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఫైటర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్. అయితే కొన్ని గంటల క్రితమే హృతిక్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఫైటర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 21 (బుధవారం) అర్ధరాత్రి నుంచే ఫైటర్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానుంది ఈ సంస్థ. ఈ మ్యాటర్‌ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. కాగా థియేటర్లలో కేవలం హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఓటీటీలో కాబట్టి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండే ఛాన్స్‌ ఉండటంతో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Read Also : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మెగా మూవీ..!

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే..యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఫైటర్ మూవీలో అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. అందుకు తగ్గట్టే ఇందులోని వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీన్స్ ఆడియెన్స్‌ను ఇట్టే కట్టిపడేశాయి. సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ అందించిన సంగీత బాణీలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. మీరు కూడా వర్క్‌ బిజీలో ఈ మూవీని థియేటర్లలో చూడలేక చాలా మిస్ అయ్యారా? మరి లేటెందుకు హాయ్‌గా ఓటీటీలో చూసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ