Mega Movie With Uppena Fame Buchi Babu : ఆర్‌ఆర్‌ఆర్ మూవీ హిట్ కావడంతో అదే జోష్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ హీరో రామ్‌చరణ్. తాజాగా తాను యాక్ట్ చేస్తున్న మూవీ అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శంకర్, డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅరవింద్, బోకనీకపూర్‌తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొని ఈ మూవీ టీంకి అభినందనలను తెలిపారు.
ఇక ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. అనంతరం రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిబాబు రాసిన స్టోరీ తనకెంతో నచ్చిందన్నారు. ఆడియెన్స్ తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారని అన్నారు.ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న మూవీ కావడంతో అటు మెగా ఫ్యాన్స్‌కి, ఇటు బుచ్చిబాబుకి క్యూరియాసిటీ పెరిగింది. స్పోర్ట్స్ డ్రామాగా.. విలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథతో ఈ మూవీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Read More: ఓటీటీలోకి ఫైటర్ ఎంట్రీ..
ఇక ఈ మూవీలో హీరో రామ్‌చరణ్ పుల్ లెంథ్ రోల్‌తో పవర్‌పుల్ క్యారెక్టర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్‌చరణ్‌కి జంటగా హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ మూవీకి రెహమాన్ స్వరాలు అందించనున్నారు.ఆర్‌సీ16గా ఈ మూవీ టైటిల్ ప్రచారంలో ఉంది. పెద్ది టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, వృధ్ధి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా… త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉండగా దేవర మూవీ షెడ్యూల్ కోసం జాన్వీ కపూర్ వర్క్‌లో బిజీగా ఉంది. వీరిద్దరి షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే వీరి మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. బుచ్చిబాబు, రామ్‌చరణ్ కాంబోలో ఈ మూవీ రావడంతో ఇటు బుచ్చిబాబు ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ పుల్ క్యూరియాసిటితో ఉన్నారు.