BCCI Team Selection: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన
India-Vs-South-Africa (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

BCCI Team Selection: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ… గిల్‌ విషయంలో కండిషన్

BCCI Team Selection: భారత్ – దక్షిణాఫ్రికా (India Vs South Africa) మధ్య ప్రస్తుతం 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుండగా, త్వరలోనే 5 మ్యాచ్‌‌ల టీ20 సిరీస్ షురూ కానుంది. డిసెంబర్ 9 నుంచి మొదలుకానున్న ఈ సిరీస్‌కు బీసీసీఐ ఇవాళ (బుధవారం) జట్టుని (BCCI Team Selection) ప్రకటించింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar yadav) వ్యవహారించనుండగా, శుభ్‌మన్ గిల్‌ను (Subhman Gill) వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ప్రకటించారు. అయితే, గిల్ అందుబాటులో ఉండేది, లేనిది బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చే క్లియరెన్స్‌తో ముడిపడి ఉంటుందని చెప్పారు. గత నెలలో కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో గిల్ గాయపడ్డాడు. ఆట మధ్యలోనే మైదానం వీడాడు. మెడ గాయం కావడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణంగా గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

జట్టులోకి పాండ్యా, బుమ్రా

టీ20 సిరీస్‌కు 15 మంది ఆటగాళ్లతో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో, ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన టీ20 సిరీస్‌లోని చాలా మంది ఆటగాళ్లు తిరిగి చోటు దక్కించుకున్నారు. అయితే, ఆసీస్ పర్యటనలో అంతగా రాణించలేకపోయిన రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనపెట్టారు. ఇక, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫిట్‌నెస్‌ సాధించడంతో ఆల్‌రౌండర్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 26న దుబాయ్‌లో శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. ఈ కారణంగా మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు. పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. దాదాపు 2 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్‌పై బరోడా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. 77 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.

Read Also- India vs South Africa: రాయ్‌పూర్‌ వన్డేలో భారత్ అద్భుత బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

పూర్తి జట్టు ఇదే

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా,
వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9న మొదలవుతుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరుగుతుంది. మిగతా మ్యాచ్‌లు వరుసగా ముల్లన్‌పూర్‌లో డిసెంబర్ 11న, ధర్మశాలలో డిసెంబర్ 14న, లక్నోలో డిసెంబర్ 17న, అహ్మదాబాద్‌లో డిసెంబర్ 19న జరుగుతాయి. ఈ మేరకు ఇదివరకే షెడ్యూల్ సిద్ధమైంది. సాధారణంగా ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలు, లేదా 7.30 గంటలకు ప్రారంభవుతాయి. అయితే, షెడ్యూల్‌లో మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ఇంకా పేర్కొనలేదు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు ఇంకా టీ20 జట్టుని ప్రకటించలేదు.

Read Also- Hyderabad Crime: గంజాయి దందాలో ఎక్స్‌పర్ట్ లేడీ డాన్.. నీతూ భాయ్ అరెస్ట్..!

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!