India vs South Africa: రాయ్‌పూర్‌ వన్డేలో భారత్ అద్భుత బ్యాటింగ్
Raipur-ODI (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India vs South Africa: రాయ్‌పూర్‌ వన్డేలో భారత్ అద్భుత బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

India vs South Africa: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ సాధించడం, యంగ్‌స్టార్ రుతురాజ్ గైక్వాడ్ కెరీర్‌తో తొలి శతకం నమోదు చేయడం, మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ ఈ భారీ స్కోర్ చేయగలిగింది.

భారత బ్యాటర్లలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండవ సెంచరీ నమోదు చేశాడు. 90 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి, అయితే, ఆ వెంటనే, వ్యక్తిగత స్కోర్ 102 పరుగుల వద్ద ఔటయ్యాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన ఈ స్టార్ ప్లేయర్, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్క్రమ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కోహ్లీ తర్వాత క్రీజులో అడుగుపెట్టినప్పటికీ, యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత రీతిలో శతకాన్ని నమోదు చేశాడు. 83 బాల్స్ ఎదుర్కొని 105 పరుగులు బాదాడు. 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన అతడు, మార్కో యన్సెన్ బౌలింగ్‌లో జోర్జీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయారు. జైస్వాల్ 22, రోహిత్ 14 పరుగులు మాతమ్రే చేసి ఔటయ్యారు. ధాటికి ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు.

మళ్లీ ఆకట్టుకున్న కేఎల్ రాహుల్

భారత వన్డే తాత్కాలిక కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ రెండో వన్డేలోనూ ఆకట్టుకున్నాడు. వరుసగా మ్యాచ్‌లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొని 66 (నాటౌట్) పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 24 (నాటౌట్) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి, దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.

Read Also- Crime News: 150కి పైగా దొంగతనాలు చేసిన కరుడ గట్టిన దొంగ అరెస్ట్.. వాడి కన్నుపడితే ఇల్లు గుల్లే..!

పరుగులు నియంత్రించలేకపోయిన సఫారీలు

రాంచీ వన్డే మాదిరిగానే, రాయ్‌పూర్ వన్డేలోనూ దక్షిణాఫ్రికా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 5 వికెట్లు కోల్పోగా, అందులో 4 మాత్రమే బౌలర్లు పడగొట్టగా, ఒక వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 2 వికెట్లు తీసిన మార్కో యన్సెన్ టాప్ బౌలర్‌గా నిలిచాడు. నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి చెరో వికెట్ తీశారు. సౌతాఫ్రికా పేసర్ కొర్బిన్ బాష్ బౌలింగ్‌లో భారత బౌలర్లు పరుగుల వరద పారించారు. అతడు మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేయగా, ఏకంగా 79 పరుగులు బాదారు. కేశవ్ మహారాజ్ వేసిన 10 ఓవర్లలో 70 పరుగులు పిండుకున్నారు. అత్యుత్పంగా ఎంగిడి 10 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!