Delhi University: ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రామ్‌జస్ కాలేజ్ (నార్త్ క్యాంపస్), దేశ్‌బందు కాలేజ్ (కల్కాజీ)లకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ విషయం తెలియడంతో వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ దళాలు రెండు క్యాంపస్‌లకు చేరుకుని పరిశీలనలు ప్రారంభించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు తెలిపారు.
కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలో వరుసగా ఇలాంటి బెదిరింపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్‌లో రెండు పాఠశాలలు, మూడు కోర్టులకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం గమనార్హం. అన్ని చోట్ల కూడా పోలీసులు విచారణ చేసినప్పటికీ చివరకు అవన్నీ తప్పుడు అలారాలుగానే తేలాయి.
ఇదే విధంగా జూలైలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ద్వారకాలోని సెయింట్ థామస్ స్కూల్ సహా కనీసం ఏడు పాఠశాలలకు ఒకే రోజున బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం ఆందోళన రేపింది. ఆ సమయంలో కూడా ఏ బెదిరింపు నిజం కాకపోవడంతో పోలీసులు పరిశీలనలు ముగించారు. విచారణలో ఒక బెదిరింపు ఈమెయిల్‌ను సౌత్ ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల బాలుడు సరదాగా పంపినట్లు గుర్తించారు. అతడిని ప్రశ్నించిన అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. అన్ని బెదిరింపులు చివరకు తప్పుడువిగా తేలినా, ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం వల్ల తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
VIDEO | Delhi: Two Delhi University colleges, including Ramjas College, received bomb threat emails today, prompting panic among students and staff. Police and the bomb squad were immediately deployed, and visuals show crowds gathered outside the college as authorities carried… pic.twitter.com/rq4uMwX7Gl
— Press Trust of India (@PTI_News) December 3, 2025
