Jangaon Municipality: పార పట్టి మట్టి ఎత్తిన పెద్దసారు..!
Jangaon Municipality (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపల్ క‌మిష‌నరా మ‌జాకా.. పార పట్టి మట్టి ఎత్తిన పెద్దసారు..!

Jangaon Municipality: ఆయ‌నొక మున్సిఫాలిటికి క‌మీష‌న‌ర్‌.. ఆయ‌న చేతి కింద అనేక‌మంది నౌక‌ర్లు.. క‌నుసైగ చేస్తే చాలు కార్మికులంతా క్యూక‌ట్టి మ‌రి ప‌నిచేస్తారు.. వేలాది మందికి కేంద్ర‌బిందువైన మున్సిపాలిటిలో అటేండ‌ర్‌గా ప‌నిచేసే వ్య‌క్తే ద‌ర్పం చూపిస్తారు.. అలాంటి మున్సిపాలిటికి క‌మీష‌న‌ర్‌గా ఉండి కూడా ఎలాంటి ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌కుండా నేనొక కార్మికుడినే.. ప్ర‌జా సేవ‌కుడినే అంటూ మ‌ట్టి ఎత్తాడు.. స్థంభం ప‌ట్టాడు.. ఓ కార్మికుడిగా మారి పార‌చేత ప‌ట్టి మ‌ట్టి ఎత్తిపోసి ఔరా అనిపించారు. ఇది జ‌న‌గామ మున్సిపాలిటి క‌మీష‌న‌ర్ మ‌హేశ్వ‌ర‌రెడ్డి(Commissioner Maheshwar Reddy) ప‌నిత‌నానికి నిద‌ర్శ‌నం. త‌న కింద ప‌నిచేసే కార్మికుల‌తో క‌లిసి ప‌నిచేసి ప‌నిమంతుడే అనిపించుకున్నారు.

Also Read: Samsung Galaxy S26 Ultra: ఇండియాలో లాంచ్ కాబోతున్న సామ్‌సంగ్ S26 అల్ట్రా.. ఫీచర్లు ఇవే !

వివ‌రాల్లోకి వెళితే..

క‌మీష‌న‌ర్ చేసిన ఈ ప‌నికి జ‌న‌గామ మున్సిపాలిటిలోని ప్ర‌జ‌లు శ‌భాష్ క‌మీష‌న‌ర్ గారు అంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. జ‌న‌గామ మున్సిపాలిటి క‌మీష‌న‌ర్ మ‌హేశ్వ‌ర‌రెడ్డి(Maheshwar Reddy) ఉద‌య‌మే ప‌ట్ట‌ణంలోని బ‌తుకమ్మ కుంట‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల వ‌ద్ద‌కు వెళ్ళారు. అక్క‌డ ఉన్న కార్మికుల‌తో క‌లిసి పార ప‌ట్టి, మ‌ట్టి ఎత్తి ప‌నులు చేశారు. సిమెంట్ స్థంభాన్ని ఎత్తి ప‌క్క‌కు వేశారు. కార్మికులు ఎంత వ‌ద్దు అని వారిస్తున్నా విన‌కుండా త‌ప్పేముంద‌య్యా, నేను మీతో ఒక కార్మికుడ‌నే క‌దా.. నేను కూడా ప్ర‌జా సేవ‌కుడినే క‌దా అంటూ వారితో అని ప‌నిలో మునిగిపోయారు. అటుగా పోతున్న వాక‌ర్స్ ఈ దృశ్యాల‌ను చూసి త‌మ సెల్‌ఫోన్‌లో క‌మీష‌న‌ర్ చేస్తున్న ప‌నుల‌ను బంధించారు.

Also Read: CM Revanth Reddy: హడ్కో ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌తో సీఎం రేవంత్ భేటి.. కీలక అంశాలపై చర్చ

Just In

01

Naga Vamsi: ఐబొమ్మ రవి.. వాడు మాకు రాబిన్‌హుడ్‌లా తయారయ్యాడు..

Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

Nitish Kumar Reddy: తొలి వన్డేలో నితీష్ రెడ్డిని ఎందుకు ఆడించలేదు?.. జట్టు కూర్పుపై మాజీ దిగ్గజం తీవ్ర విమర్శలు

Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్‌లో ట్రాన్స్ జెండర్లు నియామకం!

Gadwal News: హస్తగతం కోసం కాంగ్రెస్ ఆరాటం.. పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పోరాటం