Huzurabad Area Hospital: రేడియాలజిస్ట్ చేతిలో స్కానింగ్ సెంటర్!
Huzurabad Area Hospital (imagecredit:swetcha)
కరీంనగర్

Huzurabad Area Hospital: ఏరియా హాస్పిటల్‌లో ఓ రేడియాలజిస్ట్ చేతిలో బందీ అయిన స్కానింగ్ సెంటర్!

Huzurabad Area Hospital: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్‌లో రిజర్వ్ మెడికల్ ఆఫీసర్‌గా (RMO) విధులు నిర్వహిస్తున్న రేడియాలజిస్ట్ తీరు పేద రోగులకు శాపంగా మారింది. తమకు ఉచితంగా అందాల్సిన స్కానింగ్ సేవలు అందక, గర్భిణీ స్త్రీలు, ఇతర పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఈ అధికారిపై సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పలువురు రోగులు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.

నిర్లక్ష్యానికి సిబ్బంది వంత:

RMOగా పనిచేస్తున్న రేడియాలజిస్ట్ నిత్యం విధులకు ఎగనామం పెడుతూ, ‘టిఫిన్, టీ’ వంటి సాకులు చెప్పి స్కానింగ్ విభాగాన్ని ఖాళీగా వదిలి వెళ్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, రోగులకు సహాయం చేయాల్సిన నర్సింగ్ సిబ్బంది కూడా ఈ RMOకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అధికారి లేని ప్రతిసారీ, సిస్టర్ “సార్ ఇప్పుడే వెళ్లారు, ఇప్పుడే వస్తారు” అంటూ తప్పుడు సమాధానాలతో రోగులను మరింత నిరాశకు గురిచేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.

బదిలీ కోసం వికృత క్రీడ:

ఈ RMO ఉద్దేశపూర్వకంగానే విధులకు అడ్డుకట్ట వేస్తూ, తనను ‘శిక్ష’ పేరుతో బదిలీ (ట్రాన్స్‌ఫర్) చేస్తారనే దురుద్దేశంతో ఈ వికృత క్రీడకు తెరలేపినట్లు తెలుస్తోంది. కొందరు వైద్యులతో జరిపిన చర్చల్లోనూ ఈ అంశం వెల్లడికావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా వ్యవహరించే వారికి బదిలీ అనేది ఒక రకంగా ‘బహుమతి’ ఇచ్చినట్లే అవుతుందని, ఇది ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేస్తుందని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

స్పందించిన సూపరింటెండెంట్:

ఈ వ్యవహారంపై హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా, ఆయన ఈ ఫిర్యాదులు వాస్తవమేనని ధృవీకరించారు. “ఈ విషయం మా దృష్టికి వచ్చింది. దీని తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. సోమవారం వచ్చిన ఫిర్యాదుతో సహా, మొత్తం అంశాన్ని మేము తక్షణమే పై అధికారులకు నివేదిస్తున్నాము. తప్పకుండా కఠిన చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నాము” అని తెలియజేశారు.

ప్రజా సంఘాల హెచ్చరిక:

నిర్లక్ష్యం వహించిన అధికారులను కేవలం బదిలీ చేసి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా, వారిని తక్షణమే డిపార్ట్‌మెంట్‌కు అటాచ్ చేస్తూ, జీతభత్యాలు నిలిపివేసి కఠిన శిక్ష (పనిష్మెంట్) విధించాలని ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను అడ్డుకుంటున్న ఇలాంటి బాధ్యతారాహిత్య అధికారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు హెచ్చరించారు.

Also Read: Collector Rahul Raj: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిబంధనలు.. పోటీ చేసే అభ్యర్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ మార్గదర్శకాలు!

Just In

01

Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

Nitish Kumar Reddy: తొలి వన్డేలో నితీష్ రెడ్డిని ఎందుకు ఆడించలేదు?.. జట్టు కూర్పుపై మాజీ దిగ్గజం తీవ్ర విమర్శలు

Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్‌లో ట్రాన్స్ జెండర్లు నియామకం!

Gadwal News: హస్తగతం కోసం కాంగ్రెస్ ఆరాటం.. పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పోరాటం

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపల్ క‌మిష‌నరా మ‌జాకా.. పార పట్టి మట్టి ఎత్తిన పెద్దసారు..!