Collector Pravinya: జిల్లాలో NH-65 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(Collector Praveenya) సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ విభాగం (NHAI), విద్యుత్, ట్రాఫిక్, పోలీసు , తదితర అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు.
హైవే పనుల కారణంగా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. NH-65 పనులు జిల్లాలో కీలకమైనవని, ఏవిధమైన జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులను ముందుగానే సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని, ఆయా శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. హైవే పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హైవే పనులను త్వరిత గతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Also Read: Telangana Police: ఖాకీవనంలో కలుపు మొక్కలు.. టార్గెట్లు పెట్టుకుని మరీ నెలవారీ వసూళ్లు!
అధికారులకు సూచనలు
అధికారులు ఈ సందర్భంగా చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులు, భూ సేకరణ, యుటిలిటీల మార్పిడి వంటి అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) మాధురి, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, నేషనల్ హైవే అథారిటీ ఎస్ ఈ ధర్మారెడ్డి, ఈఈ రమేష్, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ శాస్త్రి, సంగారెడ్డి ఆర్ డి ఓ రాజేందర్, వక్స్ బోర్డ్, దేవాదాయ, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర విభాగాల అధికారులు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు పాల్గొన్నారు.
Also Read: Samantha Wedding: దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు!.. ఎక్కడంటే?
