Jio Recharge Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్..
jio ( Image Source: Twitter)
బిజినెస్

Jio Recharge Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. కేవలం రూ.200 లోపే బెస్ట్ రీఛార్జ్ ఆఫర్లు ఇవే!

Jio Recharge Plans:  Jio సిమ్ వాడుతున్న వాళ్లలో చాలామందికి తక్కువ ఖర్చుతో మంచి రీచార్జ్ ప్లాన్ కావాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వారందరికీ జియో రూ.200 లోపే కొన్ని మంచి ప్లాన్లు అందిస్తోంది. ఇవి డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS వంటి బెనిఫిట్స్‌తో పాటు JioTV వంటి యాప్స్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నాయి. ఈ బడ్జెట్ సెగ్మెంట్ ప్లాన్లు వినియోగదారులకు మంచి విలువను ఇస్తుండటంతో వీటి డిమాండ్ పెరుగుతోంది.

Also Read: Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

రూ.198 ప్లాన్ విషయానికి వస్తే, ఇది 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అలాగే ఫ్రీగా JioTV యాక్సెస్ అందుతుంది. డేటా ఎక్కువగా ఉపయోగించే యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. రూ. 186 ప్లాన్ కూడా మంచి డీల్‌గానే చెప్పాలి. 28 రోజుల పాటు దీనిలో రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు అందుతాయి. ముఖ్యంగా జియో ఫోన్ వాడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Also Read: Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

రూ. 152 ప్లాన్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. 28 రోజుల వాలిడిటితో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 0.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తం 300 SMSలు, అలాగే JioTV యాక్సెస్ అందుతుంది. తక్కువ డేటా అవసరాలున్న వారికి ఇది మంచి ఎంపిక. ఇదే విధంగా, రూ.125 ప్లాన్ కూడా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. 23 రోజుల పాటు ఇది రోజుకు 0.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, JioTV యాక్సెస్‌ను ఇస్తోంది. సాధారణ వాడకానికి ఇది చీపెస్ట్ & బెస్ట్ ప్లాన్‌గా చెప్పొచ్చు.

Also Read:  Collector Rahul Raj: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిబంధనలు.. పోటీ చేసే అభ్యర్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ మార్గదర్శకాలు!

రూ. 200 లోపే జియోలో ఇంకా చాలా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవాలంటే Jio అధికారిక వెబ్సైట్‌లోని పూర్తి వివరాలు చూడడం మంచిది. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

Just In

01

Gogoi on Modi: పార్లమెంట్‌ను మోదీ హైజాక్ చేశారు.. కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్

AP Viral Infection: ఏపీలో కొత్త వ్యాధి కలకలం.. పురుగు నుంచి పుట్టుకొచ్చిన మహమ్మారి..?

Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్

WhatsApp: వాట్సప్, మెసేజింగ్ యాప్‌లకు DoT షాక్.. 6 గంటల తర్వాత లాగ్ అవుట్ చేయాల్సిందే!

Strange Incident: పానిపూరి తింటూ.. దవడ విరగొట్టుకున్న మహిళ.. వామ్మో ఇదేం విచిత్రం!