Viral Video: కార్పొరేట్ ఉద్యోగం మానేసి ఆటో డ్రైవర్ గా రాకేష్
Viral ( Image Source: instagram)
Viral News

Viral Video: కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్ ను అయ్యా.. జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా.. వీడియో వైరల్

Viral Video: ఈ మధ్య కాలంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది లే ఆఫ్స్ వలన తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో, వారికీ వచ్చిన పనిని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా ఓ వ్యక్తి తన ఉద్యోగం వదిలి డ్రైవర్ గా చేస్తున్నాడు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

బెంగళూరులో రాకేష్ అనే వ్యక్తి, కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో రిక్షా డ్రైవర్‌గా మారిన అనుభవాన్ని సోషల్ మీడియా లో షేర్ చేశాడు. Rakesh Auto Driver అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ అయిన వీడియో, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. జీవితం, డబ్బు గురించి అతని మాట్లాడిన నిజమైన మాటలు చాలా మందికి ప్రేరణగా మారాయి.

Also Read: Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

భయాన్ని మానేసి కొత్త జీవితం ప్రారంభించండి..

వీడియోలో రాకేష్ ఇలా చెబుతున్నాడు, “ నా జీవితంలో ఒక సమయంలో పూర్తిగా గందరగోళంలో, భయంతో ఉన్నాను. జీవితమే పూర్తిగా పోయిందని అనుకున్నప్పుడు మళ్లీ తిరిగి లేవలేనేమో అని భయ పడ్డాను. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తూ, కొత్తదాన్ని ప్రయత్నించడంలో భయం మొత్తం పోయిందని చెబుతున్నాడు. మీరు కూడా అలాగే “జీవితం ముగిసిపోతుందని భావించే వారు, ఏం చేయాలో తెలియని వారు, ఇది మీకోసమే. ఏదైనా ఎదురైతే, నేను ఎదుర్కొంటాను అని మీకు మీరే అనుకుని ముందుకు వెళ్ళాలి ” అని రాకేష్ తెలిపాడు.

Also Read: Collector Rahul Raj: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిబంధనలు.. పోటీ చేసే అభ్యర్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ మార్గదర్శకాలు!

అతను చెప్పిన విధంగా, సామాజిక అంచనాలను వదిలేసి కొత్త మార్గంలో అడుగుపెట్టడం, అతనికి సంతృప్తికరమైన పని, వ్యక్తిగత వృద్ధి పై దృష్టి పెట్టడానికి సహాయపడింది. “ జాగ్రత్తగా జీవించండి, ఏదొక పని చేయడంలో ఫోకస్ పెట్టండి. డబ్బు ముఖ్యమే, కానీ అది ఒక్కటే మాత్రమే కాదు. జీవితానికి విలువ కనిపెట్టండి, నిజమైన లక్ష్యాన్ని కనుగొనండి” అని రాకేష్ చెప్పాడు.

సోషల్ మీడియా రెస్పాన్స్

ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన వారు వందల మంది యూజర్లు రాకేష్ ని ప్రశంసించారు. చాలామంది సామాజిక అగౌరవం, అహంకారం దాటేసి ధైర్యంగా మారిన తీరు కోసం బాగా ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలు కూడా పంచుకున్నారు, “నేను HR & Marketing లో MBA, ఇప్పుడు డ్రైవర్. మీ కథ నన్ను deeply resonate చేసింది,” అని చెప్పినవారు కూడా ఉన్నారు.

Also Read: Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

“రాకేష్ కేవలం తన కెరీర్ ను మాత్రమే మార్చలేదు, ధైర్యం చూపడం, తనను తెలుసుకోవడం, విజయం అంటే ఏమిటో చూపించాడు. అతని ఈ ప్రయాణం, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, చాలా మందికి జీవితంలో కొత్త మార్గాలు, పాఠాలు నేర్పుతోంది.”

Just In

01

CM Revanth Reddy: వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Electric SUV: అత్యంత వేగమైన ఎలక్ట్రిక్ SUV ఇదేనా?

Jogipet News: ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేసిన ఓ యువకుడు.. గుర్రంపై వచ్చి నామినేషన్!

Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?

Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ.. మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?