Gratuity Rules: మారిపోయిన రూల్స్.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
Gratity Rules (Image source X)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Gratuity Rules: కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త.. పర్మినెంట్ ఉద్యోగులకు నిరాశే! గ్రాట్యూటీ కొత్త రూల్స్

Gratuity Rules: దీర్ఘకాలంపాటు సంస్థకు అందించిన సేవలకు గుర్తింపుగా, కృతజ్ఞతగా ఉద్యోగికి యాజమాన్యం అందించే నగదు ప్రోత్సాహకమే గ్రాట్యూటీ. పేమెంట్ ఆఫ్ గ్రాడ్యూటీ యాక్ట్ 1972 ప్రకారం, ఇదొక చట్టబద్ధమైన హక్కుగా కూడా వర్తిస్తుంది. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ అయినప్పుడు, లేదా రాజీనామా చేసినప్పుడు, సంస్థను వీడిన సమయంలో ఈ మొత్తం గ్రాట్యుటీ మొత్తాన్ని చెల్లిస్తారు. తమ కంపెనీ కోసం పనిచేసిన వ్యక్తి తన జీవితంలో తదుపరి దశకు వెళ్లటప్పుడు ఆర్థిక భరోసా కల్పించడం గ్రాట్యూటీ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే,

ఒక ఉద్యోగి సంస్థపై చూపిన విశ్వాసం, నిబద్ధత, సేవలకు యాజమాన్యం కృతజ్ఞత చాటిచెప్పడంగా భావించవచ్చు.

అయితే, ఇటీవలే దేశవ్యాప్తంగా కొత్తగా 4 లేబర్ కోడ్‌లు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల రూపంలో కార్మికులు, ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యూటీ నిబంధనలు (Gratuity Rules) మారాయి. ఈ సంస్కరణల ద్వారా చాలా మందికి లబ్ది చేకూరే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ మారిన నిబంధనలు ఏమిటి?, ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? అన్న ఆసక్తి కార్మిక, ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. మరి కొత్త చట్టం నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

Read Also- Pawan Security Breach: డిప్యూటీ సీఎం పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

కొత్త లేబర్ కోడ్స్, ముఖ్యంగా సామాజిక భద్రత కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ఈ రెండు చట్టాలు.. కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్దిష్ట కాలపరిమితితో నియమించుకున్న ఉద్యోగులకు కూడా పర్మినెంట్ ఉద్యోగులతో (ఫిక్స్‌డ్-టర్మ్) సమానమైన ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం, ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు కేవలం ఒక ఏడాది కంటిన్యూగా సర్వీస్ చేస్తే గ్రాట్యూటీకి అర్హత లభిస్తుంది. ఈ పరిమితి గతంలో కనీసం 5 సంవత్సరాలుగా ఉండేది. ఈ మార్పుతో ఉద్యోగులకు చాలా పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇదే ప్రయోజనం పర్మినెంట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా? అనే విషయంలో మాత్రం కొంతమందిలో కన్ఫ్యూజన్ నెలకొంది.

ఒక ఏడాది సర్వీస్‌తో గ్రాట్యూటీకి అర్హులు ఎవరు?

సామాజిక భద్రత కోడ్-2020 ప్రకారం… ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు (Fixed-term employees) కేవలం ఒక్క సంవత్సరం నిరంతరంగా జాబ్ పూర్తి చేస్తే గ్రాట్యూటీ పొందడానికి అర్హులు అవుతారు. ఫిక్స్‌డ్ టైమ్ ఎంప్లాయీస్ మాదిరిగానే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఒక ఏడాది జాబ్ చేస్తే గ్రాట్యూటీకి అర్హత సాధిస్తారు. 5 ఏళ్ల పరిమితిని కేవలం 1 సంవత్సరానికి తగ్గించారు. అయితే, పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రం 1 సంవత్సరం సర్వీస్ తర్వాత గ్రాట్యూటీ అర్హత నిబంధన వర్తించదు. ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని కొత్త చట్టంలో పేర్కొన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు పాత నిబంధన, అంటే గ్రాట్యూటీకి అర్హత పొందడానికి 5 సంవత్సరాలపాటు నిరంతర సర్వీస్ అందించాల్సి ఉంటుంది. మొత్తంగా కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రాట్యూటీ అర్హత విషయంలో గొప్ప ప్రయోజనం దక్కిందన్నమాట.

Read Also- Akhanda 2 Teaser: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ నుంచి మరో మాసివ్ టీజర్ రాబోతుంది.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతిలో హరీష్ రావు చిట్టా..?

MLA Defection Case: మలుపు తిరిగిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..?

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు: కేటీఆర్

Nitin Nabin Sinha: ఆశావహుల ఆశలపై నీళ్లు.. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ సిన్హా..?

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ విజన్.. రైజింగ్ 2047ను ప్రదర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి