SIP Investment: 15 ఏళ్లలో రూ.50 లక్షలు కావాలా?, ఇలా చేస్తే చాలు
SIP-Plan (Image source X)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

SIP Investment: 15 ఏళ్లలో రూ.50 లక్షలు కావాలా?, సిప్‌లో ఒక నెలకు ఇన్వెస్ట్ చేయాల్సింది ఎంతంటే?

SIP Investment: ఎంత సంపాదించామన్నది ముఖ్యంకాదు, కష్టార్జితంలో జాగ్రత్తగా ఎంత దాచిపెట్టామన్నది భవిష్యత్‌ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. సేవింగ్ చేయడమంటే, ఏదో దాచిపెట్టడం కాదు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట లక్ష్యం లేకుండా అడుగులు వేస్తే గమ్యాన్ని చేరుకుంటారో, లేదో గ్యారంటీ ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే లక్ష్యాలను చేరుకోవడం తేలిక అవుతుంది. పర్సనల్ ఫైనాన్స్‌పై అవగాహన పెరిగిన నేటి కాలంలో ఆర్థిక లక్ష్యాల దరిచేరేందుకు అనువుగా ఉన్న సిప్‌ (Systematic Investment Plan), మ్యూచువల్ ఫండ్స్ వంటి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాలకు ఆదరణ పెరుగుతోంది. అయితే, పెట్టుబడి సాధనం ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

15 ఏళ్లలో రూ.50 లక్షలు ఎలా?

ఎవరైనా ఓ వ్యక్తి 15 సంవత్సరాలలో రూ. 50 లక్షలు కూడబెట్టాలనే ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. సిప్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో (SIP Investment) 15 ఏళ్లలో రూ. 50 లక్షల లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వార్షిక రాబడి (వడ్డీ) 9 శాతం అంచనాగా ఉంటే, నెలకు రూ.13,213 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే వార్షిక రాబడిని 10 శాతంగా అంచనా వేస్తే నెలకు రూ.12,063 సేవ్ చేయాల్సి ఉంటుంది. వార్షిక రాబడి 11 శాతం అంచనా వేస్తే నెలకు రూ.10,996, 12 శాతం లెక్క అయితే నెలకు రూ. 10,008 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Read Also- GHMC: జీహెచ్ఎంసీలో విలీనం పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. జీవో జారీ అప్పుడే..?

ఈ 15 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్ రూ.18 లక్షల నుంచి రూ. 24 లక్షలు వరకు పెట్టుబడి పెడతారు. లక్ష్యంగా నిర్దేశించుకున్న రూ.50 లక్షల్లో మిగతా మొత్తం చక్రవడ్డీ (Compounding) ద్వారా జనరేట్ అవుతుందని, సిప్‌లో రాబడి ప్రభావవంతంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో నెలకు రూ.10 వేల చొప్పున సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదిహేను సంవత్సరాలలో రూ.50 లక్షలు కూడబెట్టవచ్చని సంకేత్ మిశ్రా అనే ఆర్థిక సలహాదారు వివరించారు. ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్, స్మాల్ లేదా మిడ్-క్యాప్స్, హెడ్జ్ (Hedge) కోసం బంగారంతో కూడిన బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు.

Read Also- Rangareddy District: పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘనత.. ఆ గ్రామంలో సర్పంచ్‌, వార్డ్ మెంబెర్స్ సంపూర్ణ ఏకగ్రీవం!

ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే, ప్రణాళిక వేయడమే కాదు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తేనే లక్ష్య సాధన తేలిక అవుతుంది. ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి?, ఎంత వడ్డీ వస్తుంది?, సగటున వార్షిక రాబడి ఎంత అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సానుకూలమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చక్కటి వృద్ధిని అందిస్తాయని అంటున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని అందించడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటామన్నారు. సిప్‌లలో ఇన్వెస్ట్ చేస్తే, పోర్టుఫొలియోల ఆధారంగా స్టాక్ మార్కెట్ రిస్కుల ప్రభావాన్ని అధిగమించి, చక్రవడ్డీ ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. మార్కెట్లలో అస్థిరత్వం ఉన్నా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.

Just In

01

MLA Defection Case: మలుపు తిరిగిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..?

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు: కేటీఆర్

Nitin Nabin Sinha: ఆశావహుల ఆశలపై నీళ్లు.. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ సిన్హా..?

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ విజన్.. రైజింగ్ 2047ను ప్రదర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Drinking Water: జలమండలి ప్రత్యేక వ్యూహం.. రేపటికోసం కాస్త ముందుగానే కళ్లు తెరిచిన వాటర్ బోర్డ్!