GHMC: జీహెచ్ఎంసీలోకి 27 యూఎల్‌బీల విలీనం
GHMC ( image Credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీలోకి 27 యూఎల్‌బీల విలీనం.. మరింత పెరగనున్న బల్దియా విస్తీర్ణం!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరింత పెరగనున్నది. ఇప్పటి వరకు 30 సర్కిళ్లు, 6 జోన్లతో మొత్తం 650 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన బల్దియా పరిధి త్వరలోనే మరింత విస్తరించనున్నది. గ్రేటర్‌కు బయట, ఔటరి రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)ల విలీన ప్రతిపాదన అంశాన్ని మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశం టేబుల్ ఐటమ్‌గా తీసుకుని ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రీయాంబుల్‌ ప్రతిపాదనను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు.

Also Read: GHMC Council Meeting: మనం రౌడీలమా? ప్రజాప్రతినిధులమా?.. కార్పొరేటర్లపై జీహెచ్ఎంసీ మేయర్ ఆగ్రహం

రిమార్క్స్‌ను సమర్పించాలని కూడా కౌన్సిల్

27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిమార్క్స్‌ను సమర్పించాలని కూడా కౌన్సిల్ అధికారులను ఆదేశించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించేందుకు సర్కారు చేస్తున్న కసరత్తు ఒ కొలిక్కి వచ్చినట్టయింది. అంతేగాక, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026 – 27) కు జీహెచ్ఎంసీ రూపకల్పన చేస్తున్న వార్షిక బడ్జెట్ తయారీకి సంబంధించి విలీన ప్రతిపాదనలో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను తయారు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసింది.

విలీన ప్రతిపాదనలో ఉన్న యూఎల్‌బీలు

పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పొచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్ పూర్, బడంగ్‌ పేట్, బండ్లగూడ జగీర్, మీర్‌ పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌ నగర్, నిజాం పేట్ వంటి మొత్తం 27 స్థానిక పట్టణ సంస్థలు సర్కారు పంపిన విలీన ప్రతిపాదనల్లో ఉన్నాయి.

Also Read: GHMC: అధికార పార్టీని ఇరికించేందుకు బీజేపీ బీఆర్ఎస్ భారీ స్కెచ్..!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క