OnePlus 13R: త్వరలో మన ముందుకు రాబోతున్న వన్ ప్లస్ ఫోన్
OnePlus 13R ( Image Source: Twitter)
బిజినెస్

OnePlus 13R: భారీ డిస్కౌంట్ తో మన ముందుకు రాబోతున్న OnePlus 13R.. ఫీచర్లు ఇవే!

OnePlus 13R: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసి నట్లయితే.. ఇదే మంచి సమయం. ఇండియాలో OnePlus 15R అధికారిక లాంచ్‌కు ముందే మార్కెట్‌లో మంచి హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పాపులర్ అయిన OnePlus 13R (12GB+256GB) మోడల్‌కు ఫ్లిప్ కార్ట్ ( Flipkart‌ ) లో తాజా ధర తగ్గింపు రావడం కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. పవర్‌ఫుల్ పనితీరు కావాలన్నా, లేదా వాల్యూ-ఫర్-మనీ ఫోన్ కోసం వెతుకుతున్నా.. ఈ డీల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే తీసుకునే మంచి అవకాశాన్ని అందిస్తోంది.

Also Read: Ponnam Prabhakar: ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే పర్మిట్ రద్దు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

OnePlus 13R మొదట భారత్‌లో రూ.42,999 ధరతో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ( Flipkart‌) లో ఇది రూ.38,514కి వస్తోంది. అంటే రూ. 3,525 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తో వస్తోంది. అదనంగా, Flipkart SBI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే 5% క్యాష్‌బ్యాక్‌తో ( అంటే గరిష్టంగా రూ.4,000) ధరను రూ.34,514 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఉపయోగిస్తే, మీ పాత ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ధరను ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందులో గరిష్టంగా రూ.31,800 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read: CM Revanth Reddy: నేషనల్ స్పోర్ట్స్ మీట్.. ఛాంపియన్ షిప్‌ను సాధించిన తెలంగాణ.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి!

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే,  వన్ ప్లస్ 13R (OnePlus 13R) లో 6.77-అంగుళాల 1.5K ProXDR LTPO డిస్‌ప్లే, 2780×1264 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, Adreno 750 GPU ఉండడంతో పనితీరు మరింత స్మూత్‌గా ఉంటుంది. 6,000mAh బ్యాటరీతో పాటు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ (2X ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ Astral Trail, Nebula Noir (ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నాయర్) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Also Read: Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ వ్యాపార వేత్తలను బెదిరిస్తున్నారు.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

OxygenOS 15 (Android 15 ఆధారంగా) పనిచేసే ఈ డివైస్ 4 సంవత్సరాల Android అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుంది. అంతేకాకుండా, Wi-Fi 7, NFC, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలర్ట్ స్లైడర్, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా, ప్రీమియం వన్ ప్లస్ ( OnePlus ) ఫోన్‌ను తక్కువ ధరలో కొనాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ మొబైల్.

Just In

01

Aadi Srinivas Slams KTR: కేవలం 175 ఓట్ల తేడాతో 2009లో గెలిచావ్.. కేటీఆర్ కామెంట్స్‌కు ఆది స్ట్రాంగ్ కౌంటర్!

Fake Death Scam: హోమ్ లోన్ తీర్చేందుకు నకిలీ మరణం.. ప్రేయసి చాట్స్‌తో బయటపడ్డ మోసం

Hydra: ప్రజావాణికి 46 ఫిర్యాదులు.. కబ్జాలపైనే ఎక్కువగా ఆర్జీలు!

UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్

GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!