Malaysia Glowing Roads: మలేషియాలో సెమెనియ్ దగ్గర డ్రైవర్లు, ప్రభుత్వ అధికారుల్ని మొదట్లో మెస్మరైజ్ చేసిన ఒక ప్రయోగం.. చివరికి విఫలంగా మిగిలిపోయింది. 245 మీటర్ల రోడ్డు మీద సాధారణ తెల్ల గీతల బదులుగా రాత్రిళ్లు వెలిగే గ్లో–ఇన్–ది–డార్క్ పెయింట్ వేశారు. పగలు సూర్యరశ్మి దాచుకుని, రాత్రి ఆటోమేటిక్‌గా వెలిగే ఈ పెయింట్ వల్ల స్ట్రీట్‌లైట్లు లేకుండానే రహదారి కనిపించాలని ప్లాన్ చేశారు.
డ్రైవర్లకైతే మొదట్లో సూపర్ గా అనిపించింది!
ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక డ్రైవర్లు సోషల్ మీడియాలో వావ్ అంటూ చెప్పుకొచ్చారు. వర్షం, పొగమంచు ఉన్నా కూడా రోడ్ స్పష్టంగా కనిపించిందని చాలామంది చెప్పుకున్నారు. స్ట్రీట్‌లైట్లు లేని గ్రామీణ రోడ్లలో ఇది సూపర్‌గా పని చేస్తోందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఏటా 6,000 పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశానికి ఇది మంచి సొల్యూషన్ అనిపించింది.
Also Read: Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..
కానీ, ఆ కాంతి ఎక్కువ కాలం నిలవలేదు?
2024 నవంబర్‌కి రాగానే డిప్యూటీ వర్క్స్ మినిస్టర్ అహ్మద్ మస్లాన్ స్పష్టంగా చెప్పేశారు.. “ఈ ప్రాజెక్ట్‌ను ఇక విస్తరించలేం” అని.
గ్లో రోడ్లు అనే కాన్సెప్ట్ కొత్తది కాదు. నెదర్లాండ్స్, జపాన్ లాంటి దేశాల్లో చిన్న స్ట్రెచ్‌లలో ట్రై చేశారు. కానీ, మలేసియా మాత్రం పెద్ద పని చేయాలని స్ట్రీట్‌లైట్లే అవసరం లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అక్కడే అసలు సమస్య వచ్చింది.
ఒక్క చదరపు మీటర్ పెయింట్ ఖరీదు – RM749 (సుమారు రూ. 13,000)
సాధారణ రహదారి గీత పెయింట్ – RM40 మాత్రమే
అంటే ఖర్చు 20 రెట్లు ఎక్కువ!
వాతావరణం కూడా వాళ్ళని మోసం చేసింది. మలేషియాలోని తేమ, ఎండ, నిరంతర వర్షాలు పెయింట్‌ని త్వరగా డ్యామేజ్ చేశాయి. MIROS ఇంజనీర్లు చెబుతున్నదేమిటంటే.. “ఇలాంటి మినిసెంట్ పెయింట్ క్లైమేట్‌లో 12–18 నెలల్లోనే మసకబారిపోతుంది.” అని చెప్పుకొచ్చింది. 2023లో దీనిని ఫుల్‌గా సపోర్ట్ చేసిన వర్క్స్ మినిస్టర్ అలెగ్జాండర్ నంటా లింగ్గీ కూడా చివరికి ఒప్పుకున్నారు. “ఖర్చు ఎక్కువ… లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ క్లియర్‌గా లేదు” అని చెప్పారు.
