Madhya Pradesh Crime: మానవ సంబంధాలు నానాటికి బలహీనమవుతున్నాయి. భర్తను భార్య, అమ్మను కొడుకు, తల్లిని కూతురు చంపుతున్న ఘటనలు నిత్యం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిహార్ లోనూ ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మామలతో చెలరేగిన రాజకీయ వివాదం.. అల్లుడి హత్యకు దారి తీసింది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాల్లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ కు చెందిన 22 ఏళ్ల శంకర్ మాంఝీ తన మామలు తుఫానీ, రాజేష్ లతో కలిసి మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో గల ఒక భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మద్యం తాగడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లుడు శంకర్ ఆర్జేడీ పార్టీకి సానుభూతి పరుడు. మామలు జేడీయూ పార్టీకి మద్దతుదారులు.
ఈడ్చుకెళ్లి.. బురదలో పడేసి..
మద్యం మత్తులో మామలైన తుఫానీ, రాజేష్.. ఆర్జేడీ నేత అయిన తేజస్వి యాదవ్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇది చూసి అల్లుడు శంకర్ తట్టుకోలేకపోయాడు. అలా మాట్లాడవద్దని వారించాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శంకర్ వారిని దూషించడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరు మామలు.. శంకర్ పై దాడి చేశారు. అల్లుడని పట్టించుకోకుండా చితకబాది.. దగ్గర్లోని బురద గుంట వద్దకు ఈడ్చుకెళ్లారు. అనంతరం బురద గుంటలో శంకర్ ను పడేసి ఊరిపిడాకుండా చేసి హత్య చేశారు. శంకర్ చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత ఘటనాస్థలి నుంచి పారిపోయారు.
Also Read: CM Revanth Reddy: సింగపూర్, టోక్యోతో పోటీ పడతాం.. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
గంట వ్యవధిలోనే అరెస్ట్
అయితే బురదలోని శంకర్ మృతదేహం.. సగం మునిగిన స్థితిలో స్థానికులకు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం. ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంట వ్యవధిలోని ఇద్దరు మామలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి విచారించగా జరిగింతా పోలీసులకు వివరించారు. విచారణ సందర్భంగా రాజకీయ వివాదం, మద్యం మత్తు, కోపం కారణంగా శంకర్ ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని గుణ జిల్లా ఎస్పీ సోనీ తెలిపారు. రాజకీయ అభిరుచులు ఎంతటి ఘోరానికి దారి తీస్తాయో ఈ విషయం అద్దం పడుతోందని పేర్కొన్నారు.

