Kolkata Test: భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (Kolkata Test) ఆతిథ్య టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. 124 పరుగుల లక్ష్య చేధనతో రెండవ ఇన్నింగ్స్‌లో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది. టార్గెట్ చేజింగ్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మినహా మిగతా ఎవరూ చెప్పుకోగదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
మిగతా బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 1 పరుగుతో వచ్చిన వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 31, ధ్రువ్ జురెల్ 13, రిషబ్ పంత్ 2, రవీంద్ర జడేజా 18, అక్షర్ పటేల్ 26, కుల్దీప్ యాదవ్ 1, జస్ప్రీత్ బుమ్రా 0, మొహమ్మద్ సిరాజ్ 0 చొప్పున స్వల్ప స్కోర్లు చేశారు. కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.
Read Also- Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..
మరోవైపు, దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఆ జట్టు స్పిన్నర్ సైమన్ హార్మర్ కీలకమైన 4 వికెట్లు తీశాడు. మార్కో యన్‌సెన్, కేశవ్ మహారాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, మరో వికెట్ మార్క్‌రమ్ తీశాడు. దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ సైమన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బౌలర్ల వికెట్ల జాతర
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా దెబ్బకొట్టాడు. 5/27 గణాంకాలతో అద్భుత బౌలింగ్ చేశాడు. దీంతో 159 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆధిక్యం సాధించలేకపోయింది. 189 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో, 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ 5 వికెట్లు తీశాడు.
ఇక, రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా (4/50), కుల్దీప్ యాదవ్ చెలరేగినా, దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా 55 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆలౌట్ అయ్యేలోగా దక్షిణాఫ్రికా స్కోర్‌ను 153 పరుగులకు చేర్చాడు . దీంతో భారత్ విజయ లక్ష్యం 124 పరుగులుగా ఖరారైన విషయం తెలిసిందే.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. 15 సంవత్సరాల తర్వాత భారత్‌లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించింది. ఆ జట్టు కెప్టెన్ తెంబా బావుమా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏకంగా 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌ను గెలిపించిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా నిలిచారు.
Read Also- Warangal Cold Wave: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజా.. వృద్ధులు, పిల్లలు జాగ్రత్త అంటూ వైద్యుల సూచన
LADIES & GENTLEMEN- MEET TEMBA BAVUMA:
– First South African captain to win an ICC title in the 21st century.
– First South African captain to win a Test match in India in 15 years. pic.twitter.com/FFmDyMNHTD
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2025
