Warangal Cold Wave: వారం రోజులుగా ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలిపంజా విసురుతున్నది. వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి సమయంలో గాలితో కూడిన చలితోపాటు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున 13.8 డిగ్రీ కాగా అత్యల్పంగా అదే జిల్లాల్లోని టేకుమట్లలో 11.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనగామ జిల్లా సగటు 13.7 డిగ్రీలు, బచ్చన్నపేటలో 11.5 డిగ్రీలుగా రికార్డ్ అవుతున్నాయి.
Also Read: Cold Wave: తెలంగాణలో తీవ్రమైన చలి.. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు
సగటున 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు
హనుమకొండ జిల్లాలో సగటున 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అత్యల్పంగా ఎల్కతుర్తిలో 12.2 డిగ్రీలు నమోదైంది. వరంగల్ జిల్లాలో సగటున 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అత్యల్పంగా చెన్నారావుపేటలో 12.8 డిగ్రీలుగా రికార్డ్ అవుతున్నది. మహబూబాబాద్ జిల్లాలో సగటున 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అత్యల్పంగా గంగారంలో 13 డిగ్రీలుగా ఉన్నది. ములుగు జిల్లాలో సగటున 14.2 డిగ్రీలు ఉంటే అత్యల్పంగా మల్లంపల్లిలో 13.3 డిగ్రీలుగా ఉంటున్నది. గతేడాదితో పోలిస్తే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 7 నుండి 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి.
చలితో జాగ్రతలు పాటించాలి
చలి తీవ్రతతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తగిన మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చలి తీవ్రత వల్ల సీజనల్ ఫ్లూ వచ్చే అవకాశం ఉటుందని హెచ్చరిస్తున్నారు. వారం రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Severe Cold Wave: హైదరాబాదీలకు వణుకుపుట్టించే అప్‌డేట్ ఇదీ.. రాబోయే 6 రోజులు తట్టుకోలేరు!
