Cold Wave ( Image credit: swetcha reporter)
Uncategorized

Cold Wave: తెలంగాణలో తీవ్రమైన చలి.. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు

Cold Wave: వాతావరణ మార్పులతో తెలంగాణలో తీవ్రమైన చలి ఏర్పడే అవకాశం ఉన్నట్లు కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గతంలో 17 రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నదని, దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కూడా వాతావరణ పరిస్థితులు, దాని ప్రభావంతో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని  ప్రత్యేక నోట్‌ను రిలీజ్ చేసింది. ప్రికాషన్స్ మస్ట్ అంటూ సూచించింది. ఈ స్పెషల్ అనౌన్స్‌ను సీరియస్‌గా ఫాలో కావాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ప్రజలను కోరారు.

Also Read: Health Department: మెడికల్ కార్పొరేషన్ లో ఆగని కమిషన్ల పర్వం.. ఆ ఆఫీసర్ చెప్పిందే వేదం!

చల్లని వాతావరణంతో తీవ్ర అనారోగ్యాలు

అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి, గాలి పీడనంతో పాటు వేగం పెరుగుదలను కోల్డ్ వేవ్‌గా పరిగణిస్తారని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు ప్రాంతాల్లో ఉన్నట్లే వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. చల్ల గాలులకు సీజనల్ ప్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. అంతేగాక హైపోథెర్మియాతో పాటు చర్మం లోపలి కణజాలం గడ్డకట్టి గాయాలు కావడం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఆస్తమాతో పాటు దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల వ్యాధులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. తద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో నే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని పబ్లిక్ హెల్త్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.

శ్యాస వ్యాయామాలు అవసరం

డాక్టర్ రాజీవ్ పల్మనాలజిస్టు, క్రిటికల్ కేర్

చల్లని వాతావరణం శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన శ్వాస సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఊపిరి తిత్తులు పనితీరును మెరుగు పరచుకునేందుకు వైద్యుని సలహాలు మేరకు వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉన్నది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు వారం లోపు తగ్గకుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. న్యూమోనియో పేషెంట్లు అత్యంత అలర్ట్‌గా ఉండాలి. ఇమ్యూనిటీ శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

Also Read: Health Department: ఆరోగ్యశాఖలో ముగ్గురు ఆఫీసర్లకు పదోన్నతులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన హెచ్ వోడీలు, ఉద్యోగులు

Just In

01

Happy Children’s Day: బాలల దినోత్సవం రోజు మీ పిల్లలకు ఇలాంటి బహుమతులు ప్లాన్ చేయండి!

Red Fort Blast: దిల్లీలో ఒకటి కాదు.. 4 కార్లతో పేలుళ్లకు కుట్ర.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Local Body Elections: సీఎస్‌తో పంచాయతీ రాజ్ అధికారుల భేటీ.. రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ

Mallikarjun Kharge: ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడానికి లేదు.. హర్యానాలో ఏం జరిగిందో చూశాం.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

BRS: సైలెంట్ ఓటింగ్‌పై గులాబీ ఆశలు.. కచ్చితంగా గెలుస్తామని ధీమా!