Health Department ( image credit: free pic)
తెలంగాణ

Health Department: ఆరోగ్యశాఖలో ముగ్గురు ఆఫీసర్లకు పదోన్నతులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన హెచ్ వోడీలు, ఉద్యోగులు

Health Department: పబ్లిక్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రభుత్వం నుంచి చార్జ్ మెమోలు జారీ అయినప్పటికీ, జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ కల్పించడం ఇప్పుడు వైద్య శాఖలో (Health Department) హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్ల సమయంలో జరిగిన తప్పిదాలు, నిర్లక్ష్​యంలో సదరు అధికారిణికి ప్రభుత్వం చార్జ్ మోమోలు ఇచ్చింది. కానీ, తాజాగా ఇచ్చిన ప్రమోషన్లు.. ఆఫీసర్లలోనూ చర్చనీయాంశమైంది. విధుల్లో నిర్లక్ష్యం, విజిలెన్స్, ఏసీబీ కేసులు వంటివి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సహజంగానే ప్రమోషన్ల లిస్టులో పెండింగ్ పెడతారు. డీపీసీ(డిపార్ట్‌మెంట్ ప్రమోషనల్ కమిటీ) వీటన్నింటిని పరిశీలించిన తర్వాతనే ప్రమోషన్‌కు అప్రూవల్ ఇస్తారు.

Also Read: Health Department: మెడికల్ కార్పొరేషన్ లో ఆగని కమిషన్ల పర్వం.. ఆ ఆఫీసర్ చెప్పిందే వేదం!

ఏకంగా ఏడు మందికి మెమోలు

అయితే, వైద్యారోగ్యశాఖ జనరల్ ట్రాన్స్‌ఫర్ల సమయంలో పోస్టింగ్‌లు, మాడిఫికేషన్ సమయంలో కొందరు ఆఫీసర్లు, ఉద్యోగులకు భారీగా ముడుపులు అందాయని బాధితులు గతంలో ఆరోపణలు చేశారు. నచ్చిన వాళ్లకు అనుకూలమైన చోట పోస్టింగ్‌లతో పాటు ట్రాన్స్‌ఫర్‌లలోనూ వెసులుబాటు ఉండేలా వ్యవహరించారని బాధితులు ఫిర్యాదులు చేయడంతో పాటు కోఠిలో ధర్నా కూడా చేశారు. వీటిని పరిశీలించిన ఆఫీసర్లు.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఏకంగా ఏడు మందికి మెమోలు ఇచ్చారు. వారిలో ఇప్పుడు ప్రమోషన్ పొంది మహిళా ఆఫీసర్ కూడా ఉండటం గమనార్హం. కానీ ఇవన్నీ పరిశీలించకుండానే డీపీసీ అప్రూవల్ చేసిందా? అనే ప్రశ్నలు కూడా డిపార్ట్‌మెంట్‌లో మొదలయ్యాయి.

మెడికల్ బోర్డులో పోస్టింగ్

వైద్యారోగ్యశాఖలో 2024–2025 ప్యానెల్ ఇయర్‌లో అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ముగ్గురు గ్రూప్–1 ఆఫీసర్లకు ప్రమోషన్లు కల్పిస్తూ హెల్త్ సెక్రెటరీ ఉత్తర్వులు ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ కేడర్లో పనిచేస్తున్న ఎన్ కృష్ణవేణికి జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ కల్పిస్తూ డీఎంఈ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇక స్వేతా మొంగాకు జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేస్తూ మెడికల్ బోర్డులో పోస్టింగ్ ఇచ్చారు. మంజునాథ్‌కు జాయింట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇస్తూ నేషనల్ హెల్త్ మిషన్‌లో పోస్టింగ్ కేటాయించారు.

మెమోలు ఉన్నాయనే విషయం డీపీసీ గుర్తించలేదా?

అయితే ఈ ముగ్గురిలో ఓ అధికారిణికి మెమోలు ఉన్నాయనే విషయం డీపీసీ గుర్తించలేదాTelangana Health Department, promotion controversy, charge memos, public health officer, DPC approval? అనే సందేహాలు కూడా ఉన్నాయి. మంగళవారం హెల్త్ సెక్రెటరీ ఉత్తర్వులు రిలీజ్ చేసిన తర్వాత వివిధ విభాగాల హెచ్ వోడీలతో పాటు ఉద్యోగులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గతంలో కిందిస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లు, పోస్టింగ్‌ల విషయంలో సతాయించిన సదరు అధికారిణికి నిబంధనలు ఉల్లంఘించి ప్రమోషన్ కల్పించడం ఏమిటీ? అంటూ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయంపై వైద్యారోగ్యశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఓ యూనియన్ నేత తెలిపారు.

Also Read: Health Department: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎనలేని నిర్లక్ష్యం.. ప్రజలు అంటే బాధ్యత లేని వైనం!

వైద్యాశాఖలో భారీ ప్రమోషన్లు.. 7 జిల్లాలకు పర్మినెంట్ డీఎమ్‌హెచ్‌వోలు

తెలంగాణ వైద్యారోగ్యశాఖలోని పబ్లిక్ హెల్త్ విభాగంలో ప్రమోషన్ల పర్వం కొనసాగింది. డిప్యూటీ సివిల్ సర్జన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లకు సివిల్ సర్జన్లుగా ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్ సెక్రటరీ ఈ ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగా, ఏడు జిల్లాలకు పర్మినెంట్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు (డీఎమ్‌హెచ్‌వోలు) లభించారు.

మెడికల్ ఆఫీసర్లుగా పోస్టింగ్‌

సంగారెడ్డి, చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఖమ్మం, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాలకు శాశ్వత డీఎమ్‌హెచ్‌వోలను నియమించారు. వీరితో పాటు, మరో ఐదుగురికి జాయింట్ డైరెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 21 మందికి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లుగా పోస్టింగ్‌లు కేటాయించారు. అదనంగా, అడిషనల్ డీఎమ్‌హెచ్‌వోలు, జోనల్ మలేరియల్ ఆఫీసర్, నీలోఫర్ హెల్త్ స్కూల్‌కు ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురికి పోస్టింగ్‌లు కేటాయించబడ్డాయి. ఈ ప్రమోషన్ల ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమైన పోస్టులు భర్తీ అయినట్టు అయింది.

Just In

01

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. చట్నీ మీద వేశాడని.. దారుణంగా పొడిచి చంపారు!

TG High Court: సిగాచీ పేలుళ్ల బాధితులపై హైకోర్టు కీలక ప్రశ్న.. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం!

Chinmayi Sripaada: అలాంటి ట్రోల్స్ చేసేవారికి వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి..

Forest Department: పులుల లెక్కింపుకు వలంటీర్లకు ఆహ్వానం.. ఏఐటీఈ 2026 టైగర్ లెక్కింపులో తెలంగాణ కీలక పాత్ర!

Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం