Health Department( image credit: stwitter)
తెలంగాణ

Health Department: మెడికల్ కార్పొరేషన్ లో ఆగని కమిషన్ల పర్వం.. ఆ ఆఫీసర్ చెప్పిందే వేదం!

Health Department: వైద్యారోగ్యశాఖ (Health Department)ను ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాలు ప్రయత్నిస్తుంటే, కొంత మంది ఆఫీసర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా వైద్యారోగ్యశాఖ (Health Department)లోని మెడికల్ కార్పొరేషన్ లో కమీషన్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో వచ్చినట్లు ఆయా కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కానీ తాము చేయడం వలనే బిల్లులు వచ్చాయని కొందరు ఆఫీసర్లు కాంట్రాక్టర్లపై ప్రెజర్ పెడుతున్నట్లు తెలిసింది.

ఈ కాంట్రాక్టర్లలోని ఓ వ్యక్తికి వసూల్ బాధ్యతలు

నాలుగు శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీనిలో హైలెవల్ ఆఫీసర్లకూ వాటాలు అందజేయాలని కొందరు క్రింది స్థాయి ఆఫీసర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారట. అంతేగాక ఈ కాంట్రాక్టర్లలోని ఓ వ్యక్తికి వసూల్ బాధ్యతలు అప్పగించారు. ఆయన సుమారు 20 మంది కాంట్రాక్టర్లకు ఓ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో కమ్యూనికేట్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్టులు, బిల్లులు రెగ్యులర్ గా అందాలంటే కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సదరు కాంట్రాక్టరు కూడా జోస్యం చెప్పడం గమనార్హం.

Also Read: Education Health Department: వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు.. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్​ కుమ్మక్కు?

ఆయన చెప్పిందే వేదం

సెంట్రల్ సర్వీస్ నుంచి కార్పొరేషన్ లో కీ రోల్ పోషిస్తున్న ఓ అధికారి కాంట్రాక్టర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారనే చర్చ స్వయంగా అదే కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన చెప్పిందే వేదం అన్న తరహాలో కార్పొరేషన్ లో చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి సెంట్రల్ సర్వీస్ నుంచి ఎఫ్​ ఎ స్ డీపై వచ్చిన ఆఫీసర్ గడువు ముగిసినా,ఇంకా ఎఫ్​ ఎస్ డీపైనే ఎలా కొనసాగుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ఎఫ్​ ఎస్ డీ(ఫారెన్ డిప్యూటేషన్ సర్వీస్) పై కార్పొరేషన్ కు రాగా, 2024 తో ఆయన గడువు ముగిసింది.సెంట్రల్ నుంచి అనుమతులు ఉన్నా…స్టేట్ పర్మిషన్ మాత్రం ఇప్పటికీ ఆయనకు రాలేదు. సెక్రటేరియట్ లో ఫైల్ పెండింగ్ లోనే ఉన్నది. కానీ కార్పొరేషన్ కూర్చీలోనే ఇంకా కూసోని హావా నడిపిస్తున్నారనే చర్చ ఉన్నది. సదరు ఆఫీసర్ ఒక్కరి వలన కార్పొరేషన్ అంతా బ్యాడ్ నేమ్ వస్తుందని ఉద్యోగులు సైతం మండిపడుతున్నారు. పైగా ఈ కమిషన్ల ప్రాసెస్ లో ఎండీ పేరు కూడా వాడుకున్నట్లు తెలిసింది.

ఎంట్రీ లోనే చేతి వాటం?

కార్పొరేషన్ లో మందుల బిల్లులు ఎంట్రీ చేయాలన్నా క్లెయిమ్ కావాలన్నాకమీషన్లు ఇవ్వాల్సిందే. పేరుకే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ రూల్ అంటున్నారని, కమీషన్ లేనిదే బిల్లులు ఇవ్వడం లేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఎంట్రీ సమయంలో కమిషన్ ఇచ్చినోళ్లవే ముందు లిస్టు చేసి అప్ లోడ్ చేస్తున్నారని, దాని వలన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ బ్రేక్ అవుతుందని కాంట్రాక్లర్లు చెప్తున్నారు. బిల్లులు ఎంట్రీకి 2 శాతం, క్లెయిమ్ కు మరో రెండు శాతం చొప్పున చెల్లించనిదే పని కాదని తేల్చి చెప్తున్నారట. కార్పొరేషన్ లో తిష్ట వేసిన ఎఫ్​ ఎస్డీ ఆఫీసర్…ఈ కమిషన్ నుంచి అందరికీ షేర్ ఇవ్వాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లపై ప్రెజర్ పెడుతున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై తాజాగా స్వేచ్ఛ వివరణ కోరగా,‘‘ కార్పొరేషన్ లో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ స్పష్టంగా జరుగుతుంది. కమీషన్ల విషయంలో తన పేరును వాడితే చర్యలు ఉంటాయి. కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. రూల్ ప్రకారమే బిల్లులు వస్తాయి.”అని టీజీ ఎంఐడీసీ ఎండీ క్లారిటీ ఇచ్చారు.

Also ReadHealth Department: ఆరోగ్య శాఖకు అంటువ్యాధుల పరేషాన్.. ఆ జిల్లాల్లో హై అలర్ట్..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!