Chhattisgarh ( image credit: twitter)
జాతీయం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు!

Chhattisgarh: మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పుల పరంపర కొనసాగుతుంది.  ఉదయం కూడా సుక్మ జిల్లా బెజ్జి ప్రాంతంలోని చింతగుంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. సుక్మా జిల్లాలోని చింతగుంప పోలీస్ స్టేషన్ పరిధిలోని వెజ్ ప్రాంతంలో ఉదయం నుండి మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Also ReadChhattisgarh Train Accident: ఢీకొన్న ప్యాసింజర్ రైలు – గూడ్స్ ట్రైన్.. ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. భారీగా మృతులు

కోబ్రా దళాలతో కేంద్ర ప్రభుత్వం

ఇప్పటివరకు మావోయిస్టుల చర్యలపై భద్రత బలగాలు భీకరమైన దాడులతో రెచ్చిపోతున్నారు. మావోయిస్టులను మట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో చర్యలను కొనసాగిస్తున్నారు. నిత్యం ఏదో రకమైన ఘటనలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు స్వర్గధామంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రస్తుతం ఆ పరిస్థితులను తుడిచి పెట్టుకునే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను మట్టు పెట్టడానికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు దూసుకుపోతుంది. ఈ చర్యల్లో అత్యంత ప్రమాదకరమైన కోబ్రా దళాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

నిర్విరామంగా భద్రతా బలగాలు

ప్రమాదకరమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ను అంతమొందిస్తే ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్మూలించవడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఛత్తీస్‌గఢ్ లో అత్యంత స్వర్గధామంగా మావోయిస్టుల నిలయంగా ఉన్న అబూజ్మాడు ను భద్రతా బలగాలు చుట్టుముట్టి వారికి మనుగడ లేకుండా దాడులు నిర్వహిస్తున్నారు. పైగా ఆ ప్రాంతంపై చుట్టుముట్టి భద్రతాబలగాల బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ మావోయిస్టులకు గుక్క తిప్పుకోకుండా నిర్విరామంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీలో అగ్రనేతలతో పాటు కొంతమంది ఆదివాసి లకు చెందిన వారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పునరావాస నజరాలకు ఆకర్షితులై లొంగిపోవడానికి మాత్రమే మొగ్గుచూపుతున్నారు. మావోయిస్టుల పోరాటంలో అగ్ర నేతలుగా ఉన్న వారంతా కూడా వందల సంఖ్యలో తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలుపుతున్నారు.

ప్రత్యేకమైన పునరావాస పథకాలు 

వారందరి పై మావోయిస్టు ప్రాంతంలో కొనసాగుతున్న ఆ పార్టీ అగ్ర నేత హిడ్మా తోపాటు మరికొంతమంది లొంగిపోయిన వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పటికీ కొంతమంది అగ్ర నాయకుల బాటలో చోటా మోటా మావోయిస్టు పార్టీలో పనిచేసే వారందరు లొంగిపోయేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులకు మనుగడ లేకుండా పోతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టు లకు ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు మనుగడ లేకుండా పోవడంతో ఎక్కువమంది లొంగిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల కోసం ప్రత్యేకమైన పునరావాస పథకాలను ప్రవేశ పెడుతూ ఆ దిశగా ఆకర్షించేందుకు చర్యలను చేపడుతున్నారు.

Also Read: Chhattisgarh: హిడ్మా సరెండర్ కాబోతున్నాడా? ఏటూరు నాగారం, తుపాకులగూడెం అడవుల్లో సంచరిస్తున్నాడా?

కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఆదేశాల మేరకు

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించడానికి చేసిన ప్రణాళిక ఆపరేషన్ కగార్ కార్యక్రమంలో భాగంగా భద్రతా బలగాలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఆ క్రమంలోనే మావోయిస్టు ప్రాంతాలపై విస్తృతమైన గాలింపు చర్యలు చేపడుతూ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ మావోయిస్టు చర్యలను అణచివేస్తున్నారు. అనుకున్న ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు భద్రతాబలగాలు విస్తృతమైన చర్యలతో ముందుకు వెళుతున్నారు. కొంతమందిని పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు చర్యలను కొనసాగిస్తూనే మరికొంతమంది దాడులకు దిగే వారిని మట్టు పెడుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతంపై విస్తృతమైన నిఘాను పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో మోస్ట్ వాంటెడ్ హెడ్మాతోపాటు అతనికి అత్యంత కీలకంగా వ్యవహరించే వారిని మట్టుపెట్టాలని పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ దిశగా పయనిస్తున్నాయి.

మావోయిస్టు వ్యవస్థను నిర్మూలించడం ఖాయం

మొత్తం మీద మావోయిస్టు వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ను మట్టు పెట్టాలని భద్రత బలగాలు విశేషమైన కృషి చేస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న హిడ్మాను టార్గెట్ చేసుకుంటూ భద్రతా బలగాలు అడవులను గాలిస్తున్నాయి. ఈ అవకాశాన్ని కూడా వదలకుండా నిర్విరామంగా మావోయిస్టు నిర్మూలన కోసం పనిచేస్తున్నాయి. అనుకున్నదే అనుకున్నట్టు జరిగితే మార్చి 31 2026 కంటే ముందే మావోయిస్టు వ్యవస్థను నిర్మూలించడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఎక్కువమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా అంతమైతే కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని కంటే ముందే టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Also ReadChhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు

Just In

01

Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..

Bride Murder: చీర విషయంలో ఘర్షణ.. పెళ్లికి గంట ముందు పెళ్లికూతుర్ని చంపేసిన కాబోయేవాడు

Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు.. భారీగా నగదు, డాక్యుమెంట్ల స్వాధీనం

Andhra King Taluka: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..