Chhattisgarh: మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇప్పుడు లొంగిపోయేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నాడా? ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో హిడ్మా లొంగిపోవాలనుకుంటున్నాడా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అది నిజమేనని అటు మావోయిస్టు పార్టీ వర్గాలు, ఇటు భద్రతా దళాలు, నిఘా వ్యవస్థ బలంగానే నమ్ముతున్నాయి.
Also Read: Operation Kagar: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు కకావికలం అయ్యేనా..!
ఆపరేషన్ కగార్ ద్వారా అత్యధికంగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత
మావోయిస్టులను మట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ ద్వారా అత్యధికంగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత చెందారు. ఆ తర్వాత లొంగుబాటు ప్రక్రియలను మావోయిస్టు కీలక నేతలు ఆశ్రయిస్తున్నారు. మల్లోజుల మొదలుకొని ఆశన్న, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరికొంతమంది నేతలు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఎదుట లొంగిపోయిన ఘటనలు ఉత్పన్నమయ్యాయి. హిడ్మా సరెండర్ కోసం ఆయనకు పరిచయమున్న పోలీసు అధికారులు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు హిడ్మా కు అత్యంత సన్నిహితులైన ఆదివాసీలు కూడా పోలీసు అధికారులను సంప్రదిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
Also Read: Mulugu District: ములుగులో మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు, పోస్టర్లు కలకలం
