Operation Kagar: 1970 దశకం నుంచి 2010 వరకు అంచలంచెలుగా నక్సలైట్లు, ఆ తర్వాత పార్టీ పటిష్ట వైభవం తో మావోయిస్టు పార్టీగా అవతరించింది. 2000 సంవత్సరం నుంచి మావోయిస్టు పార్టీలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(People’s Liberation Army)గా అప్డేట్ అయిన తర్వాత వివిధ అండర్ గ్రౌండ్ కు చెందిన 12 కంపెనీలు మావోయిస్టు పార్టీలో చేరిపోయాయి. ఆ క్రమంలోని సాంస్కృతిక విభాగం చేతన నాట్యమండలి సంఖ్య 2010 నాటికి 7వేలకు చేరిపోయింది. దండకారణ్యంలో ప్రభల శక్తిగా నానాటికి మావోయిస్టు పార్టీ విస్తరించి పోయింది. మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు తొలుత సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్(Operation Green Hunt)ను 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఆర్పిఎఫ్(CRPF), ఇండో టిబెటన్ పోలీస్, బిఎస్ఎఫ్(BSF) భద్రతా బలగాలను సైతం రంగంలోకి దింపింది. మావోయిస్టులను మట్టు పెట్టడమే ధ్యేయంగా విస్తృత కూంబింగ్ లను నిర్వహించింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీల సభ్యులను నష్టపోవడం పెరిగిపోయింది.
2024 లో ఆపరేషన్ కగార్
అంత తమ చేతిలోకి వచ్చాయని నమ్మకంలో ఆపరేషన్ కగార్(Operation Kagar) ను 2024 లో కేంద్ర బిజెపి(BJP), చత్తీస్గడ్ రాష్ట్రం(Chhattisgarh State) ప్రారంభించింది. సి 60, డి ఆర్ జి, సిఆర్పిఎఫ్ లో వివిధ బెటాలియన్లు, కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకంగా వ్యవహరించి కోబ్రాస్ లకు చెందిన సాయుధ బలగాలను రంగంలోకి దించింది. ఇక మావోయిస్టు దళాల కదలికలపై మానవ, నూతన సాంకేతిక టెక్నాలజీతో కూడిన నిఘాను పెంచారు. దీంతో మావోయిస్టులపై ఖచ్చితమైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అప్పటినుంచి ప్రతి ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లేల ప్రణాళికలు రచించింది. చివరికి ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించే లొంగుబాటుకు సిద్ధమయ్యేలా అణిచివేత వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది.
Also Read: Garib Rath Catches Fire: పంజాబ్‌లో మంటల్లో చిక్కుకున్న రైలు.. తప్పిన పెనుప్రమాదం
మల్లోజుల, తక్కెళ్ళపల్లి..
అర్థ శతాబ్ది కాలంగా మావోయిస్టు దండకారణ్యంలో తమ కార్యకలాపాలను సాగిస్తూ ఎనలేని శక్తిగా నిలిచిపోయారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ దీర్ కార్యక్రమాన్ని రూపొందించి మావోయిస్టులపై పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు సాగించి విఫలమైపోయింది. అటువంటి చర్య మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను రూపొందించి మావోయిస్టులు ఎక్కడ ఉన్న వారి వైపు బలగాలు తరలించి అనుకున్న లక్ష్యం దిశగా ప్రణాళిక కార్యక్రమాలను రచించింది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులను వేల మందిని ఒకే దెబ్బలో భద్రతా బలగాలు మట్టుపెట్టే దిశగా కర్రెగుట్టల ప్రాంతంలో భీకర దాడి చేపట్టింది. ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృత్యువాత చెందారు. మంచి ఎండాకాలం సమయం కావడంతో భద్రతా బలగాలకు రీహైడ్రేషన్ దెబ్బ పడింది. దీంతో భద్రతా బలగాలు ముందుకు సాగేలా లేకపోవడంతో ఆపరేషన్ కగార్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ కర్రెగుట్టల కూంబింగ్ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా, దేవూజీ వంటి అగ్ర నేతలు భద్రత బలగాల కళ్ళుగప్పి తప్పించుకుపోయారు.
ఆయుధాలను అప్పగించి సరెండర్
ఈ ప్రక్రియల నేపథ్యంలో 40 సంవత్సరాలకు పైగా దండకారణ్యంలో తమ కార్యకలాపాలను నిర్వహించిన సీనియర్ మావోయిస్టు నేతలు, కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను దాదా, మరో కీలక నేత తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ లు మావోయిస్టుల విధివిధానాలపై విభేదిస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే గత 17వ తేదీన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో మల్లోజలతో పాటు మరో 60 మంది వివిధ కేడర్లకు చెందిన మావోయిస్టులు ఆయుధాలను అప్పగించి సరెండర్ అయిపోయారు. అది జరిగిన రెండు రోజుల్లోనే నార్త్ బస్తర్ ప్రాంతంలోని అగ్ర నేత తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ ఆధ్వర్యంలో 110 మంది మహిళ మావోయిస్టులు, 99 మంది మావోయిస్టులు బైరంగడ్ లో 153 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించి సరెండర్ అయిపోయారు. ఈ ప్రక్రియ దేశంలోనే అత్యధికంగా మావోయిస్టులు లొంగిపోయిన చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోయింది. భారీ లొంగుబాటు అనంతరం తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఓ ప్రకటనను సైతం విడుదల చేశారు.
Also Read: Perth ODI: ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమి.. రోహిత్, కోహ్లీ ఎలా ఆడారంటే?
