Mulugu District (imagecredit:swetccha)
నార్త్ తెలంగాణ

Mulugu District: ములుగులో మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు, పోస్టర్లు కలకలం

Mulugu District: మావోయిస్టు పార్టీలో రోజుకో తతంగం జరుగుతోంది. ఒకవైపు లేఖల పరంపర కొనసాగుతోంది. మరోవైపు మావోయిస్టులపై ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఆదివాసి గ్రామ ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. కొత్తగా వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ కి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవస్ఫూర్తితో నిర్వహించండి. అంటూ వాల్ పోస్టర్లు, కరపత్రాల్లో మావోయిస్టులు పొందుపరిచారు. పార్టీని పిఎల్ జి ఏ ను, ఐక్య సంఘటనను, విప్లవ ఉద్యమాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు.

విప్లవ ప్రతిఘాతుక కగారి యుద్ధాన్ని విఫలం చేసేందుకు..

విప్లవ ప్రతిఘాతుక చర్య కగార్ యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులకు వర్గ పోరాటంలో, గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దామని పిలుపునిచ్చారు. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని వివరించారు. పార్టీ శ్రేణులకు పి ఎల్ జి ఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలను ప్రజానీకానికి సిపిఐ(CPI) మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి.

మరోవైపు అభయ్ పేరిట వెళ్లడైన లేఖ..

మరోవైపు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ సోను దాదా పేరిట గత నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు కాల్పుల విరమణను నెల రోజులపాటు నిలిపివేస్తామని, దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చకు రావాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇదే లేఖ కు సంబంధించి తెలంగాణ(Telangana) రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట స్పష్టతనివ్వడం ఆ పార్టీ వర్గాల్లోని సీనియర్లు తప్పుపడుతున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి లేఖ విడుదల చేస్తే అందుకు సంబంధించి కేంద్ర కమిటీ మెంబర్స్ మాత్రమే ఖండనగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అంటే మావోయిస్టు పార్టీలో సరైన నిబద్ధత లేదనేది ఈ లేఖను బట్టి అర్థమవుతోందని ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాదాపు కొన్ని నెలల నుంచి కేంద్ర కమిటీ సమావేశాలు లేవు. అలాంటప్పుడు అభయ్ కాల్పుల విరమణ చేస్తామని చెప్పడం సబబు కాదని, ఆ క్రమంలోనే కౌంటర్ సైతం ఇవ్వడం తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ స్థాయి కాదని మావోయిస్టు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Also Read; Vijaya Dairy: విజ‌య పాల డైరీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం.. కీలక అంశాలపై చర్చ!

బిజెపి మావోయిస్టులతో ఆటలాడుతోంది

కేంద్ర బిజెపి(BJP) ప్రభుత్వం మావోయిస్టులతో ఆటలాడుతోందని ఆ పార్టీ సీనియర్ రిటైర్డ్ మావోయిస్టులు తప్పుపడుతున్నారు. చర్చలు అంటే మాట్లాడడం లేదు. చర్చల కోసం మావోయిస్టులు లేఖలు రాస్తుంటే స్పందించడం లేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మార్చి 31, 2026 కంటే ముందే మావోయిస్టుల కథ ముగిస్తామంటూ కేంద్రమంత్రి అమిత్ షా పదే పదే చెబుతుండడం ఆందోళన కలిగించే అంశమే. ప్రజా సమస్యల కోసం ఉద్యమం జీవనయానంగా సాగుతుంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ముప్పేట దాడి చేస్తుండడం మావోయిస్టుల మనుగడను పూర్తిగా దెబ్బతీసే విధంగా కనిపిస్తోంది. మావోయిజం అంతం కాదని.. విధానాల్లో తప్పు లేకపోతే మావోయిస్టు పార్టీ క్షీణించదని సీనియర్లు భావిస్తున్నారు. సాయుధ పోరాటం కంటే అనుకూల సమయంలో మావోయిస్టులు కాల్పుల విరమణ విషయంపై ప్రకటన చేస్తే బాగుండేదని భావిస్తున్నారు. చర్చలు ప్రారంభిస్తేనే మావోయిజం ముగింపు పలుకుతుందని, లేదంటే మావోయిస్టులు తన పందాను కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ పార్టీలు సైతం చర్చల విషయమే పూర్తిస్థాయిలో స్పందించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మార్కిజం సమాజం కోసం విప్లవోద్యమం చేస్తే ఎప్పటికీ క్షీణించదని భా

అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ అంతం

గత 25 ఏళ్లలో మావోయిస్టు పార్టీకి అతి పెద్ద దెబ్బ 2020 నుంచి 2025 మధ్యలో పడిందనేది మావోయిస్టుల ఉద్దేశం. 2009 నుంచి 2013 మధ్య 20,000 మంది మావోయిస్టులు ఉండేవారని రికార్డులు చెబుతున్నాయి. 2013 నాటికి 9500 మంది మిగిలారని, 2009 నుంచి 2025 వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 4875 మంది మృతి చెందారు. 2009 నుంచి 2025 వరకు 18,163 మంది పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా రికార్డులున్నాయి. 6894 మంది పోలీసులకు చిక్కిపోయారు. మావోయిస్టులను దేశవ్యాప్తంగా అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 3,13,634 సిఆర్పిఎఫ్ వివిధ బెటాలియన్లను కేటాయించింది. వివిధ రాష్ట్రాల్లో 12.89 లక్షల మంది పోలీసు బలగాలను సమకూర్చింది. ఆపరేషన్ కగార్(Operation Kagar) ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 400 మంది పైగానే మావోయిస్టులు పోలీసుల చేతుల్లో మృత్యువాత చెందారు. హిడ్మా(Hidmna) సహచర మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత సహదేవ్ సోరైన్(Sahdev Sorain), రఘునాథ్ హిమంబరం, విర్సన్ గంజూ లు జార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడంతో మావోయిస్టులు కొంత వెనకడుగు వేసి కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారేమోనని అందరు భావించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో తేటతెల్లమైంది.

కాల్పుల విరమణ.. జనజీవన స్రవంతిలోకి..

మావోయిస్టు కేంద్ర కమిటీ లో పనిచేస్తున్న కొంతమంది కాల్పుల విరమణ చేసి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారనేది అభయ్ వెల్లడించిన లేఖ ద్వారా స్పష్టమవుతుంది. మరి కొంతమంది కేంద్ర ప్రభుత్వం స్పందించి శాంతి చర్చలు జరిపితేనే ఉద్యమాన్ని వీడుతామనేది తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా వెళ్లడవుతుంది.

Also Read: Khammam: సత్తుపల్లిలో కలకలం.. జనావాసాల్లోకి చేరిన జింక.. సింగరేణి సిబ్బంది రక్షణ!

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు