Chhattisgarh: మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఓ జవాన్ కు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ను హెలికాప్టర్ ద్వారా భద్రత బలగాలు ఆసుపత్రికి తరలించాయి. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాల్ పట్నం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ సైనికుడు గాయపడ్డాడు. భద్రత త బృందం ఆ ప్రాంతం నుంచి గాయపడిన సైనికుడిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బీజాపూర్ జిల్లా భోపాల్ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల సంచరిస్తున్నారని సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read: Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం
మావోయిస్టుల కోసం భద్రత బలగాలు కూంబింగ్
కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళంలోని ఓ సైనికుడికి ఐఇడి పేలి ప్రమాదం సంభవించింది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనను భోపాల్ పట్నం పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రత బలగాలు కూంబింగ్ లను ముమ్మరం చేశాయి. మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడానికి భద్రతా బలకాలు నిత్యం అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఐ ఈ డి పేలిన విషయం తెలుసుకున్న భద్రత బలగాలు అదనపు బలగాలను రప్పించాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని బలమైన సమాచారంతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
భద్రత చర్యల కోసం ఐఈడీలు
మావోయిస్టులు ఐఈడీలు అమర్స్తుండగా ప్రమాదాలు మావోయిస్టులు సంచరించే ప్రాంతంలో భద్రతా చర్యల కోసం ఐఈడి లను అమర్చుతున్నారు. ఇటీవలనే భద్రత చర్యల కోసం ఐఈడీ లను అమర్చుతున్న సమయంలో కొంతమంది మావోయిస్టులు ప్రమాదాల బారిన పడ్డారు. అంతేకాకుండా మావోయిస్టులు సంచరిస్తున్న ప్రదేశంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోను పేలుడు సంభవించడంతో సైనికులు కూడా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఐఇడి బాంబులతో ప్రాణా నష్టం జరగకపోయినా అటు మావోయిస్టులకు, ఇటు భద్రతా దళాలకు గాయాలవుతున్నాయి.
Also Read: Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు
