Tata Sierra 2025: టాటా మోటార్స్ 2025లో తన ఐకానిక్ SUV టాటా సియెర్రాను కొత్త రూపంలో మార్చి మార్కెట్లోకి తీసుకు రానుంది. క్లాసిక్ బాక్సీ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక స్టైలింగ్‌తో సియెర్రా మరోసారి SUV ప్రేమికులను ఆకట్టుకోనుంది. ఒరిజినల్ మోడల్ ప్రత్యేకత అయిన “ఇన్ఫినిట్ విండో” డిజైన్ తిరిగి వస్తుండడం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. LED లైట్ బార్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బ్లాకెన్‌డ్ C & D పిలర్స్ వంటి మోడర్న్ ఎలిమెంట్లు SUVకి స్లీక్ లుక్‌ని అందిస్తున్నాయి. కొత్త సియెర్రా ధర రూ.12 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Also Read: Thummala Nageswara Rao: టైంకు రాని అధికారులపై కఠిన చర్యలు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్!
ఇంటీరియర్ విషయానికి వస్తే, సియెర్రా 2025ను పూర్తిగా టెక్నాలజీతో నింపారు. ట్రిపుల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ సెటప్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మధ్య ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కో-డ్రైవర్ స్క్రీన్.. సోఫిస్టికేటెడ్ లుక్‌తో పాటు ప్రయాణికులకు అత్యుత్తమైన అనుభవాన్ని కల్పించనుంది. Level-2 ADAS సపోర్ట్‌తో 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చనున్నాయి.
కంఫర్ట్ విషయంలో కూడా టాటా ప్రత్యేక శ్రద్ధ వహించింది. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు సియెర్రా డ్రైవింగ్ అనుభవాన్ని ప్రీమియం స్థాయికి తీసుకెళ్తాయి. SUVలో ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు మరిన్ని డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: Delhi Blast: ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది ఎక్కడ?, ఎంత డబ్బుతో?, కెమికల్స్ ఎక్కడివి?.. వెలుగులోకి అసలు!
పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, సియెర్రా 2025 పెట్రోల్, డీజిల్, పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్లలో విడుదల కానుంది. ఈ విభిన్న వేరియంట్లు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు మరింత ఎంపికల్ని అందిస్తాయి. లాంచ్ అనంతరం ఈ SUV ప్రధానంగా హ్యుందాయి క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడల్స్‌తో పోటీ పడనుంది. కానీ తన ఐకానిక్ డిజైన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, EV ఆప్షన్ వంటి ప్రత్యేకతలతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.
