Farah Khan Ali ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Farah Khan Ali: ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, జరీన్ ఖాన్ అంత్యక్రియల మీడియా కవరేజ్‌పై ఫరా ఖాన్ అలీ తీవ్ర ఆగ్రహం

Farah Khan Ali: బాలీవుడ్ ప్రముఖుడు సంజయ్ ఖాన్ భార్య జరీన్ ఖాన్ నవంబర్ 7న మరణించారు. కుటుంబం ఇంకా ఆ విషాదం నుండి కోలుకోకముందే, మరోవైపు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరడం, ఆయన వెంటిలేటర్ పై ఉన్నారనే వార్తలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. ఈ రెండు విషయాలపై మీడియా నిర్లక్ష్య ధోరణిని చూసి, జరీన్ ఖాన్ కుమార్తె డిజైనర్ ఫరా ఖాన్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లి మరణం తర్వాత కూడా అసభ్యకర ప్రశ్నలు: ఫరా ఫైర్

సోషల్ మీడియాలో స్పందించిన ఫరా, కొంతమంది నెటిజన్లు చూపిన అసంవేదనపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఫరా రాసిన పోస్ట్ లో “ నా తల్లి మరణించి 6 రోజులు కూడా అవ్వలేదు. కానీ, కొందరికి సంతాపం చెప్పడం కంటే, ఆమె ఎందుకు దహనం చేయబడిందనే విషయం పై ఆసక్తి ఎక్కువగా ఉంది. ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉండగా, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వీడియో కూడా వైరల్ చేశారంటూ ” ఆమె తీవ్రంగా విమర్శించారు.

Also Read: Jubilee Hills By poll: జూబ్లీహిల్స్‌లో ఈ సారి 48.49 శాతం పోలింగ్.. గతంలో కంటే పెరిగింది ఒక్క శాతం కన్నా తక్కువే!

ధర్మేంద్ర మరణించినట్టు తప్పుడు వార్తలు – కుటుంబం స్పందన

నవంబర్ 11న, కొన్ని మీడియా సంస్థలు ధర్మేంద్ర మరణించినట్టు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కుటుంబ సభ్యులు స్పందించక తప్పలేదు.

Also Read : Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు

ఈషా డియోల్ అధికారిక స్టేట్‌మెంట్

ధర్మేంద్ర కుమార్తె, నటి ఈషా డియోల్, తండ్రి ఆరోగ్య స్థితిపై స్పష్టత ఇస్తూ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. “ మీడియా తప్పుడు వార్తలను రాస్తుంది. నా తండ్రి స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మా కుటుంబానికి గోప్యత ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు.” అని తెలిపింది.

Also Read : Dharmapuri Arvind: కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదు : ఎంపీ అరవింద్

సన్నీ డియోల్ విజ్ఞప్తి

ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. “ ధర్మేంద్ర గారు స్థిరంగా ఉన్నారు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దయచేసి తప్పుడు రూమర్స్ ను క్రియోట్ చేయకండి. కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వండి.” నవంబర్ 13 ఉదయం, తన ఇంటి బయట వేచి ఉన్న మాట్లాడిన సన్నీ.. “ దయచేసి సెన్సిటివ్‌గా ఉండండి. మేము కష్ట సమయంలో ఉన్నాం. అనవసరంగా ఇక్కడ కోలాహలం చేయవద్దు ” అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. నిధుల గోల్‌మాల్‌పై భువనగిరి ఎస్సీ గురుకులంలో ఎంక్వయిరీ!

Bihar Elections 2025: బిహార్‌లో వార్ వన్ సైడ్.. 160+ సీట్ల గెలుపు దిశగా ఎన్డీయే.. అమిత్ షా జోస్యం నిజమైందా?

Gold Price Today: చిల్డ్రన్స్ డే స్పెషల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

TGSRTC: నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కమిటీలు: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Sridhar Babu: సక్సెస్ సాధించాలంటే.. టెక్నాలజీని సొంతం చేసుకోవాల్సిందే..!