CM On Andesri (Image Source: Twitter)
హైదరాబాద్

CM On Andesri: అందెశ్రీ పేరుతో స్మృతి వనం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. సీఎం రేవంత్

CM On Andesri: రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీని కోల్పోవడం సమాజానికే కాకుండా తనకూ వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రీగా, తెలంగాణ ఉధ్యమకారుడిగా ఆయన చెరగని ముద్రవేశారని కొనియాడారు. అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు.

‘పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి’

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందెశ్రీ తనను కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర కూడా ఉండాలని ఆ సందర్భంలో తాను సూచించినట్లు చెప్పారు. గద్దర్ తో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారని అన్నారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని రగిలించిందని కొనియాడారు. అందుకే అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు.

స్మతి వనం ఏర్పాటు

అందెశ్రీ పేరుతో ఒక స్మృతి వనాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుటుందని అన్నారు. అందెశ్రీ సంకలనాల్లోని ‘నిప్పుల వాగు’ పాట తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో ‘నిప్పుల వాగు’ను అందుబాటులో ఉంచుతామని అన్నారు.

అందెశ్రీకి పద్మశ్రీ

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా మరోమారు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా.. అందెశ్రీని గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

Also Read: TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం!

పాడె మోసిన సీఎం

అంతకుముందు హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో వాటిని పూర్తి చేశారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ పాడెను మోసి ఘనమైన నివాళులు అర్పించారు. ఆయనపై ఉన్న అపార గౌరవాన్ని సీఎం చాటుకున్నారు. మరోవైపు మంత్రులు శ్రీధర్ బాబు (Minister Sridhar babu), జూపల్లి కృష్ణారావు Jupally Krishnarao), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పాల్గొన్నారు.

Also Read: Delhi Car Blast: ఎవ్వరినీ వదిలిపెట్టం.. తగిన శాస్తి చేస్తాం.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Delhi Blast: ఢిల్లీ పేలుడు న్యూస్ చూసి.. ముగ్గురు కొడుకులకు తండ్రి ఫోన్.. ఆఖరికి ఆయన ఊహించిందే జరిగింది

The Girlfriend: సక్సెస్ సెలబ్రేషన్స్‌కి సిద్ధమవుతున్న‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

GHMC: ముమ్మరమైన రోడ్ సేఫ్టీ డ్రైవ్.. ఇప్పటి వరకూ వరకు 20 వేల 337 గుంతలు పూడ్చివేత!

Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!

Supreme Court: ఢిల్లీ పేలుడు నేపథ్యంలో.. ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం