Kishan Reddy (imagecredit:swetcha)
హైదరాబాద్

Kishan Reddy: త్వరలో అందుబాటులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కిషన్ రెడ్డి

Kishan Reddy: వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను కిషన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాన్ని చేపడుతన్నట్లు చెప్పారు. నిర్మాణం తర్వాత కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. రూ.715 కోట్లతో మొదటి దశలో పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి గంటకు 23 వేల మంది ప్రయాణికులు వస్తుంటారని, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులా..

రోజూ రాకపోకలు సాగిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా పని చేపట్టడం కత్తి మీద సాము లాంటిదని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలనేది ప్రధాని మోడీ(Modhi) కోరిక అని తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ కు.. మెట్రోకి వాక్ త్రూ కనెక్టివిటీ(Walk-through connectivity) ఇస్తున్నట్లు చెప్పారు. 26 లిఫ్ట్ లు, 32 ఎస్కలేటర్లు, 2 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. సోలార్ ప్లాంట్స్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లో పడే నీటి చుక్క బయటకి పోకుండా హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 1.97 లక్షల మంది కెపాసిటీ ఉండగా దీన్ని 2.70 లక్షల మందికి అనుగుణంగా ప్లాన్ చేసి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. అంటే గంటకు 32,500 మంది రద్దీని కూడా తట్టుకునేలా నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ప్రధాని మోడీ వచ్చి ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు.

Also Read: Abhinay Kinger death: ప్రముఖ తమిళ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూత.. చివరి క్షణాల్లో సాయం కోసం..

ఉత్సవాలకు కొత్త రైల్వే స్టేషన్..

ఈ సంవత్సరం మల్టీ లెవెల్ కారు పార్కింగ్ పనులు పూర్తిచేస్తామన్నారు. 3 ఎకరాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్(International Standards) కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ తొందర్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి ఎంతో మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారన్నారు. 2026లో సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తిచేస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. వచ్చే మల్లన్న ఉత్సవాలకు కొత్త రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాలన్నారు. ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ హయాంలో ఒక్క కిలోమీటర్ సింగిల్ లైన్ కానీ, ఒక్క డబుల్ లైన్ వేయడానికి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కానీ మోడీ ప్రధాని అయ్యాక 487 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు పూర్తిచేసిన్ట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రికార్డుస్థాయిలో 1950 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ వేశామన్నారు. వరంగల్-కరీంనగర్-బేగంపేట పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో మొత్తం మహిళలు పనిచేస్తున్నారన్నారు. గత పదేళ్లలో 293 రోడ్ అండర్ బ్రిడ్జీలు, 43 వాకోవర్ బ్రిడ్జీలు, 48 ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తిచేశామని కేంద్ర మంత్రి తెలిపారు. నేషనల్ కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇనిస్టిట్యూట్ కూడా ఇక్కడే ఉందన్నారు.

కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగం

వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ ఫెసిలిటీ సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ(Kacheguda)లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. ఘట్ కేసర్ నుంచి యాదగిరిగుట్టకు రూ.412 కోట్లతో ఎంఎంటీఎస్ ఫేస్ 2 పనులు చేపడుతన్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ ఇష్యూస్ ను పరిష్కరిస్తే పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు అవకాశం ఉందన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కు రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేదని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు లేఖ రాస్తే స్పందించలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశానని, అయినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. సీఎం తొందరగా ల్యాండ్ ఇష్యూ పై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్

Just In

01

Telangana Police: ఆలయాల్లో చోరీలు.. అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్.. ఎన్ని లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే?

TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం!

Bigg Boss Telugu: బిగ్ బాస్‌లో ఆసక్తిర టాస్క్.. కళ్యాణ్‌కు రాణులుగా రీతూ, దివ్య.. ప్రోమో మామూల్గా లేదుగా!

Fenugreek Seeds: రోజూ మెంతుల నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Rabi Season: రబీ సాగుకు రైతులు సమాయత్తం.. జోరుగా మొదలైన రబీ సాగు పనులు